aranmanai 4 ott release: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Baak ott release: తమన్నా, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించిన ‘బాక్‌’ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.

Published : 05 Jun 2024 19:51 IST

Aranmanai 4 ott release date (హైదరాబాద్): సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. తెలుగులో ‘బాక్‌’ పేరుతో విడుదలై ఇక్కడా అలరించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 (Aranmanai 4 ott release date) నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హాట్‌స్టార్‌ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

కథేంటంటే: శివశంక‌ర్ (సుంద‌ర్‌.సి) ఓ న్యాయ‌వాది. అత‌ని సోద‌రి శివాని (త‌మ‌న్నా). త‌న మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అది క‌న్న‌వాళ్ల‌కి మింగుడు ప‌డ‌దు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమంటారు. శివాని భ‌ర్త, పిల్ల‌ల‌తో క‌లిసి వారికి దూరంగా వెళ్లిపోతుంది. ఇంతలో ఉన్న‌ట్టుండి ఆత్మహ‌త్యకు పాల్ప‌డుతుంది. ఆమె భ‌ర్త కూడా అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణిస్తాడు. ఈ ప‌రిణామాలపై శివ‌శంక‌ర్‌కు అనుమానాలు రేకెత్తుతాయి. త‌న సోద‌రి ఆత్మహ‌త్య చేసుకోద‌ని గ‌ట్టిగా న‌మ్ముతాడు. ఆ ఇద్దరి మ‌ర‌ణాల వెన‌క కార‌ణాల్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి విష‌యాలు తెలిశాయి?(baak movie review) శివాని నిజంగానే ఆత్మ‌హ‌త్య చేసుకుందా లేక హ‌త్య‌నా?ఈ ప‌రిణామాల వెన‌క బాక్ అనే దుష్ట‌శ‌క్తి ప్ర‌మేయం ఏమిటి? త‌న చెల్లెలు మ‌ర‌ణానికి కార‌కులైన‌ వాళ్ల‌పై శివ‌శంక‌ర్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని