Japan movie ott release: ఓటీటీలో ‘జపాన్‌’.. స్ట్రీమింగ్‌ తేదీ ఖరారు!

Japan movie ott release: కార్తి, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన ‘జపాన్‌’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 04 Dec 2023 12:29 IST

హైదరాబాద్‌: కార్తి (Karthi) కథానాయకుడిగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ చిత్రం ‘జపాన్‌’. అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) కథానాయిక. నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కార్తి 25వ చిత్రం కావడం, క్యారెక్టరైజేషన్‌ కూడా విభిన్నంగా ఉండటంతో విడుదలకు ముందు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ, కథ, కథనాల పరంగా లోపాలు ఉండటంతో ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ఈ క్రమంలో ఓటీటీ వేదికగా ‘జపాన్‌’ (Japan movie ott release) విడుదలయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబరు 11వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

కథేంటంటే: జపాన్ ముని (కార్తి) ఓ పేరు మోసిన దొంగ‌. దోపిడీకి వ్యూహం ప‌న్నాడంటే గురి త‌ప్ప‌దంతే. పోలీసుల్ని సైతం ఎదిరించి అనుకున్న‌ది కాజేస్తాడు. ఓ దోపిడీకి పాల్పడుతున్నప్పుడు పోలీస్ అధికారుల‌కు చెందిన కొన్ని ర‌హ‌స్య‌ వీడియోలు చేతికి దొరుకుతాయి. వాటిని త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్న జ‌పాన్ పోలీసుల‌కు టార్గెట్‌గా మార‌తాడు. ఎలాగైనా ఆ వీడియోల్ని సొంతం చేసుకుని జ‌పాన్‌ని మ‌ట్టుబెట్టాల‌ని పోలీస్ అధికారులు శ్రీధ‌ర్ (సునీల్‌), భ‌వాని (విజ‌య్ మిల్ట‌న్‌) రంగంలోకి దిగుతారు. మ‌రోవైపు క‌ర్ణాట‌క పోలీసులు కూడా జ‌పాన్‌ని వెంబ‌డిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఓ నగల దుకాణంలో రూ.200 కోట్ల విలువ చేసే న‌గ‌లు దోపిడీకి గుర‌వుతాయి. ఆ దొంగ‌త‌నం జపాన్ చేశాడ‌ని పోలీసుల‌కు ఆధారాలు దొరుకుతాయి. అయినా స‌రే, ఓ అమాయ‌కుడు ఆ కేసులో ఇరుక్కొంటాడు.ఇంత‌కీ ఆ దొంగ‌త‌నం ఎవ‌రు చేశారు? జ‌పాన్ దొరికాడా? ఆ అమాయ‌కుడు ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా?అస‌లు జపాన్ ఎలా దొంగ‌గా మారాడు?సినీ న‌టి సంజు (అను ఇమ్మానుయేల్‌)తో జ‌పాన్‌కి ఉన్న బంధం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

‘జపాన్‌’ మూవీ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు