The Raja Saab: ‘రాజా సాబ్‌’ వాయిదాపై క్లారిటీ....!

Eenadu icon
By Entertainment Team Updated : 04 Nov 2025 17:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై నిర్మాణసంస్థ స్పందించింది. అనుకున్న సమయానికే విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

‘‘ప్రస్తుతం ‘రాజా సాబ్‌’కు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఐమాక్స్ వెర్షన్‌తో సహా అన్ని ఫార్మాట్‌లలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకురానుంది. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి ఫస్ట్‌ కాపీని సిద్ధం చేస్తాం. ఈ సంక్రాంతికి అన్ని థియేటర్‌లలో సందడిని రెట్టింపు చేసేందుకు ‘రాజా సాబ్‌’ (Prabhas) సిద్ధమవుతున్నాడు. విశ్వప్రసాద్‌ ఎక్కడా రాజీ పడకుండా దీన్ని నిర్మిస్తున్నారు. మారుతి ప్రతి విషయంలోనూ రెట్టింపు శ్రద్ధ తీసుకొని దీన్ని సిద్ధం చేస్తున్నారు’’ అని నిర్మాణ సంస్థ నోట్‌ విడుదల చేసింది.

మారుతి - ప్రభాస్‌ కాంబోలో వస్తోన్న తొలి చిత్రమిది. హారర్‌ కామెడీ నేపథ్యంలో ముస్తాబవుతోంది. ప్రభాస్‌ (Prabhas) సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. సంజయ్‌దత్‌ (Sanjay Dutt) కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకుతీసుకురావాలని భావించారు. ఆ తేదీ కుదరకపోవడంతో జనవరి 9కు వాయిదా వేశారు.


Tags :
Published : 04 Nov 2025 13:18 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు