skanda ott: ఓటీటీలో ‘స్కంద’ స్ట్రీమింగ్‌ తేదీ మారింది.. కొత్త డేట్‌ ఎప్పుడంటే?

skanda ott release date: రామ్‌, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మాస్‌, యాక్షన్‌ మూవీ ‘స్కంద’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 28 Oct 2023 15:00 IST

హైదరాబాద్‌: మాస్ సినిమాల‌కి పెట్టింది పేరు... బోయ‌పాటి శ్రీను. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్కంద’ (skanda ott release date). శ్రీలీల కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. తాజాగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని అనుకున్నారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు నవంబరు 2వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డిస్నీ+హాట్‌స్టార్‌ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది.

క‌థేంటంటే: పెళ్లిపీట‌ల‌పై కూర్చున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం కూతురిని... తెలంగాణ సీఎం అబ్బాయి వ‌చ్చి తీసుకెళ‌తాడు. దాంతో ఇద్ద‌రి సీఎంల మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. ఒక‌రినొక‌రు అంతం చేసుకునే వ‌ర‌కూ వెళుతుంది. ఆంధ్రా సీఎం ఓ యువ‌కుడిని రంగంలోకి దింపుతాడు. అత‌ను మామూలోడు కాదు. ఎవ్వ‌రినైనా ఎదిరించి అనుకున్న‌ది సాధించే ర‌కం. ఆ యువ‌కుడు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ని కాద‌ని తెలంగాణ సీఎం ఇంట్లోకి అడుగు పెట్టాడా? ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల కూతుళ్ల‌నీ కిడ్నాప్ చేసి రుద్ర‌రాజ‌పురం తీసుకెళ్లిన యువ‌కుడు (రామ్‌) ఎవ‌రు? ఇంత‌కీ ఆ ఊళ్లో ఎవ‌రున్నారు? ఈ కిడ్నాప్‌ల‌కీ క్రౌన్ గ్రూప్‌ కంపెనీస్ అధినేత రామ‌కృష్ణంరాజు (శ్రీకాంత్‌)కీ మ‌ధ్య సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

‘స్కంద’ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని