skanda movie review: రివ్యూ స్కంద.. రామ్-బోయపాటి కాంబినేషన్ మెప్పించిందా?
skanda movie review: రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్కంద’ మూవీ ఎలా ఉంది?
Skanda movie review | చిత్రం: స్కంద; నటీనటులు: రామ్, శ్రీలీల, సయీ మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, శరత్ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు; సంగీతం: ఎస్. తమన్; ఎడిటింగ్: తమ్మిరాజు; సినిమాటోగ్రఫీ: సంతోష్ దేటేక్; నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమర్; రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను; విడుదల: 28-09-2023
మాస్ సినిమాలకి పెట్టింది పేరు... బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రామ్ అనగానే ఆ కలయికపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. బోయపాటి మార్క్ సినిమాలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఎలా కనిపిస్తాడో చూడాలనే ఉత్సుకత ఏర్పడింది. విజయవంతమైన ‘అఖండ’ తర్వాత ఆ స్థాయి.. అంచనాలకి తగ్గట్టుగానే పాన్ ఇండియా స్థాయిలో ‘స్కంద’ చేశారు బోయపాటి శ్రీను. మరి ఈ చిత్రం ఎలా ఉంది?(Skanda movie review) రామ్ - బోయపాటి కలయిక మాస్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది?
కథేంటంటే: పెళ్లిపీటలపై కూర్చున్న ఆంధ్రప్రదేశ్ సీఎం కూతురిని... తెలంగాణ సీఎం అబ్బాయి వచ్చి తీసుకెళతాడు. దాంతో ఇద్దరి సీఎంల మధ్య వైరం మొదలవుతుంది. ఒకరినొకరు అంతం చేసుకునే వరకూ వెళుతుంది. ఆంధ్రా సీఎం ఓ యువకుడిని రంగంలోకి దింపుతాడు. అతను మామూలోడు కాదు. ఎవ్వరినైనా ఎదిరించి అనుకున్నది సాధించే రకం. ఆ యువకుడు కట్టుదిట్టమైన భద్రతని కాదని తెలంగాణ సీఎం ఇంట్లోకి అడుగు పెట్టాడా? ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లనీ కిడ్నాప్ చేసి రుద్రరాజపురం తీసుకెళ్లిన యువకుడు (రామ్) ఎవరు? ఇంతకీ ఆ ఊళ్లో ఎవరున్నారు? (Skanda movie review) ఈ కిడ్నాప్‌లకీ క్రౌన్ గ్రూఫ్ కంపెనీస్ అధినేత రామకృష్ణంరాజు (శ్రీకాంత్)కీ మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: మాస్ సినిమాకి చాలా నిర్వచనాలు ఉన్నాయి. అందులో బోయపాటి మాస్ ప్రత్యేకం. ఆయన శైలి మేకింగ్, పాత్రలతో ప్రత్యేకమైన బ్రాండ్‌ని సృష్టించుకున్నారు. శక్తిమంతంగా కనిపించే ఆయన హీరోలు సూపర్‌మేన్ తరహాలో వీరవిహారం చేస్తుంటారు. పాత్రలు నడుచుకునే తీరునీ, పోరాట ఘట్టాల్ని లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తెరపై ఆవిష్కరించి మాస్‌కి అసలు సిసలు సినిమాటిక్ అనుభూతిని పంచుతుంటారు. (Skanda movie review) ఆ నేపథ్యంలోనూ తను చెప్పాలనుకున్న విషయాన్ని మంచి భావోద్వేగాలతో చెబుతుంటారు ‘స్కంద’ సినిమాతోనూ అదే ప్రయత్నం చేశారు బోయపాటి. మాస్‌కి జాతరే ఈ సినిమా. రామకృష్ణంరాజు పాత్రతో సినిమాని మొదలుపెట్టిన దర్శకుడు, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, వాళ్ల సామ్రాజ్యాన్ని ఆవిష్కరించాక హీరోని పరిచయం చేస్తాడు. అక్కడ్నుంచి అసలు సినిమా మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య కాలేజీ డ్రామా, పాటలు, యాక్షన్ ఘట్టాలు, ఆసక్తికరమైన మలుపులతో ప్రథమార్ధాన్ని నడిపించాడు దర్శకుడు. వర్తమాన రాజకీయాలు, ఉచిత పథకాలపై చురకలు వేస్తూ కొన్ని సన్నివేశాల్ని తీర్చిదిద్దారు.
రాహుల్, నవీన్, రామకృష్ణంరాజు తదితర పాత్రలతో నిజ జీవితంలోని వ్యక్తులు గుర్తుకొస్తారు. ప్రథమార్ధం సినిమా బోయపాటి మార్క్ వీరోచిత పోరాట ఘట్టాలతో యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంది. విరామ సన్నివేశాలు మరింత హైలైట్. ద్వితీయార్ధంలో అసలు కథ ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కీలకం. ఆ ఎపిసోడ్స్‌తో కుటుంబ ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా భావోద్వేగాల్ని పండించే ప్రయత్నం చేశారు. పిలిస్తే పనోడు పలకడం వేరు, సొంత కొడుకు పలకడం వేరు... వృద్ధాప్యంతో తల్లిదండ్రులు తడబడుతున్నప్పుడు పక్కన మనం లేకపోతే ఎలా? అంటూ పల్లెటూళ్లో తీర్చిదిద్దిన సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. (Skanda movie review in telugu) పతాక సన్నివేశాల్లో వచ్చే మరో మలుపు సినిమాకి కీలకం. ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉందని ప్రకటించారు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే: తెలంగాణ యాసతోపాటు...రాయలసీమ యాసలోనూ సంభాషణలు చెబుతాడు రామ్. ఆయన పాత్ర ఇందులో పలుమార్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రెండు కోణాల్లో సాగే ఆ పాత్రలో రామ్ కనిపించిన విధానం, వైవిధ్యం ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంటుంది. బోయపాటి శైలికి తగ్గట్టుగా మారిపోయి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు, డ్యాన్స్‌లు సినిమాకి మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. (Skanda movie review)యావరేజ్ అంటూ హీరో రామ్ ఆటపట్టిస్తాడు కానీ... శ్రీలీల తన అందంతోనూ, డ్యాన్స్‌లతో తాను యావరేజ్ కాదని చాటి చెబుతుంది. పాత్రకి తగినంత ప్రాధాన్యమే ఉన్నా, ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. సయీ మంజ్రేకర్ పల్లెటూరి పాటలోనూ... సినిమాకి కీలకమైన మలుపులోనూ ఆమె కనిపిస్తుంది. రామకృష్ణంరాజు పాత్రలో శ్రీకాంత్, రామ్ తండ్రిగా దగ్గుబాటి రాజా, ముఖ్యమంత్రుల పాత్రలో అజయ్ పూర్కర్, శరత్ లోహితాశ్వ మంచి అభినయం ప్రదర్శించారు. గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్, ప్రభాకర్... ఇలా తెరపై బోలెడన్ని పాత్రలు కనిపిస్తాయి.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. బోయపాటి సినిమాకి ఎలా కావాలో అలాంటి సంగీతం సమకూర్చారు తమన్. సంతోష్ దేటకే కెమెరా పనితనం బాగుంది. ప్రతీ సన్నివేశం ఘనంగా కనిపిస్తుంది. కూర్పు, ప్రొడక్షన్ డిజైన్... తదితర విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి తన మార్క్ మాస్ సినిమాపై పూర్తి పట్టుని ప్రదర్శించారు. కథ, కథనం, ఎలివేషన్స్‌తో కట్టిపడేశాడు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. పాన్ ఇండియా సినిమా స్థాయికి తగ్గట్టే ఘనంగా ఉంది.
- బలాలు
- + రామ్ నటన, డ్యాన్స్
- + బోయపాటి మార్క్ మాస్ అంశాలు
- + యాక్షన్... భావోద్వేగాలు
- బలహీనతలు
- - అక్కడక్కడా రొటీన్‌గా అనిపించే సన్నివేశాలు
- చివరిగా: స‌్కంద... మాస్ జాతర (Skanda movie review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kotabommali PS Review: రివ్యూ: కోట బొమ్మాళి P.S. మూవీ ఎలా ఉందంటే?
Kotabommali PS Review: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివానీ కీలక పాత్రల్లో నటించిన ‘కోటబొమ్మాళి P.S.’ ఎలా ఉందంటే? -
Aadikeshava Movie Review: రివ్యూ: ఆదికేశవ.. వైష్ణవ్‌తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది?
Aadikeshava Movie Review: వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మెప్పించిందా? -
Pulimada Review telugu: రివ్యూ: పులిమడ.. మలయాళం థ్రిల్లర్ ఎలా ఉంది?
Pulimada Movie Review In Telugu: జోజు జార్జ్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన థ్రిల్లర్ ‘పులిమడ’ ఎలా ఉందంటే? -
The Railway Men Telugu Review: రివ్యూ: ది రైల్వేమెన్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై వచ్చిన సిరీస్ మెప్పించిందా?
The Railway Men Telugu Review కేకే మేనన్, మాధవన్, బాబిల్‌ఖాన్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘ది రైల్వేమెన్’ ఎలా ఉంది? -
Kannur Squad: రివ్యూ: కన్నూర్ స్క్వాడ్.. మమ్ముట్టి మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
మమ్ముట్టి నటించిన మలయాళ హిట్ చిత్రం ‘కన్నూర్ స్క్వాడ్’ తెలుగులో ‘డిస్నీ+హాట్‌స్టార్’ వేదికగా అందుబాటులో ఉంది. మరి, ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే? -
Sapta Sagaralu Dhaati Side-B Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ బి
రక్షిత్‌శెట్టి నటించిన ప్రేమకథా చిత్రం సప్త సాగరాలు దాటి - సైడ్ ఏకు కొనసాగింపుగా వచ్చిన ‘సైడ్-బి’ ప్రేక్షకులను మెప్పించిందా? -
My Name Is Shruthi Movie Review: రివ్యూ: ‘మై నేమ్ ఈజ్ శృతి’.. స్కిన్ మాఫియాను హన్సిక ఎలా ఎదుర్కొంది?
హన్సిక ప్రధానపాత్రలో నటించిన ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఎలా ఉందంటే.. -
Mangalavaram Movie Review: రివ్యూ : మంగళవారం.. పాయల్ రాజ్‌పుత్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Mangalavaram Movie Review: పాయల్ రాజ్‌పూత్ కీలక పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’ సినిమా ఎలా ఉందంటే? -
Tiger 3 Review: రివ్యూ: టైగర్-3.. సల్మాన్ నటించిన స్పై థ్రిల్లర్ హిట్టా..? ఫట్టా?
Tiger 3 Review: సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ జంటగా నటించిన ‘టైగర్’ ఎలా ఉంది? -
Pippa Movie Review: రివ్యూ: పిప్పా.. ఇషాన్ ఖట్టర్ ‘వార్’ మూవీ మెప్పించిందా?
pippa movie review: రాజా కృష్ణమేనన్ తెరకెక్కించిన ‘పిప్పా’ ఎలా ఉందంటే? -
Jigarthanda Double X Review Telugu: రివ్యూ.. జిగర్ తండ: డబుల్ ఎక్స్
Jigarthanda Double X Review Telugu: రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ ఎలా ఉంది? -
Label Review: రివ్యూ: లేబుల్.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తే?
తమిళ నటుడు జై ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘లేబుల్’. ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
Japan Movie Review: రివ్యూ: జపాన్. కార్తి కొత్త చిత్రం మెప్పించిందా?
Japan Movie Review: రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా నటించిన 25వ చిత్రం ఎలా ఉంది? -
Ghost Telugu Movie Review: రివ్యూ: ఘోస్ట్.. శివరాజ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో ఎంజీ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ మూవీ ఎలా ఉందంటే? -
Scam 2003 Volume 2 Review: ‘స్కామ్ 2003 పార్ట్ 2’.. రూ.30వేల కోట్ల స్కామ్ చేసిన వ్యక్తి ఏమయ్యాడు?
2003లో జరిగిన స్టాంప్ పేపర్ల కుంభకోణం ఇతివృత్తంగా తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘స్కామ్ 2003’. దానికి కొనసాగింపు అయిన ‘స్కామ్ 2003 వాల్యూమ్ 2’ తాజాగా ఓటీటీ ‘సోనీలివ్’లో విడుదలైంది. ఎలా ఉందంటే? -
Maa Oori Polimera 2 Review: రివ్యూ: ‘మా ఊరి పొలిమేర-2’.. భయపెట్టిందా.. లేదా?
Polimera 2 review: సత్యం రాజేష్ కీలక పాత్రలో అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘మా ఊరి పొలిమేర2’ మెప్పించిందా? -
Keedaa Cola Review: రివ్యూ: ‘కీడా కోలా’... తరుణ్ భాస్కర్ కొత్త చిత్రం మెప్పించిందా?
Keedaa Cola Review in telugu: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘కీడా కోలా’ ఎలా ఉందంటే? -
Masterpeace: రివ్యూ: మాస్టర్‌పీస్.. నిత్యా మేనన్ నటించిన వెబ్‌సిరీస్ మెప్పించిందా?
నిత్యా మేనన్ ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘మాస్టర్‌పీస్’. ‘డిస్నీ+హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Martin Luther King: రివ్యూ: మార్టిన్ లూథర్ కింగ్.. సంపూర్ణేశ్ బాబు కొత్త సినిమా ఎలా ఉందంటే?
తమిళంలో విజయవంతమైన ‘మండేలా’ సినిమాకు తెలుగు రీమేక్‌గా రూపొందిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉందంటే? -
#KrishnaRama: రివ్యూ: #కృష్ణారామా.. వృద్ధులు ‘ఫేస్బుక్’ బాట పడితే?
సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘#కృష్ణారామా’. నేరుగా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
Tiger Nageswara Rao Movie Review: రివ్యూ: టైగర్ నాగేశ్వరరావు.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా?
Tiger Nageswara Rao Movie Review: రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ఎలా ఉందంటే?


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు
-
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?
-
Exit polls: భాజపా ఖాతాలోకి రాజస్థాన్.. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ!
-
Nagarjuna sagar: సాగర్ డ్యామ్ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత
-
Ola: ఇక ఓలా యాప్‌లోనూ యూపీఐ చెల్లింపులు
-
MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్