Minnal Murali Movie review: రివ్యూ: మిన్నల్ మురళి
చిత్రం: మిన్నల్ మురళి; నటీనటులు: టొవినో థామస్,గురు సోమసుందరం, అజు వర్గీస్, సాజన్ తదితరులు; సంగీతం: సుశీన్ శ్యామ్, షాన్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్; ఎడిటింగ్: లివింగ్‌స్టోన్ మాథ్యూ; రచన: అరుణ్ అనిరుధన్, జస్టిస్ మాథ్యూ; దర్శకత్వం: బాసిల్ జోసెఫ్; విడుదల: నెట్‌ఫ్లిక్స్

సూపర్‌మ్యాన్, బ్యాట్‌మెన్, స్పైడర్ మ్యాన్ ఇలా సూపర్‌హీరోస్ అందరూ హాలీవుడ్‌లోనూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. ఇక భారత్‌లో సూపర్ హీరో పాత్రలు చాలా తక్కువ. మాస్ కమర్షియల్ సినిమాలకే ఇక్కడ ప్రేక్షకులు పట్టం కడతారు. అయితే, వైవిధ్య కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. అలా వచ్చిన చిత్రమే ‘మిన్నల్ మురళి’. మలయాళంలో ప్రయోగాత్మక చిత్రాలంటే గుర్తొచ్చే యువ నటుడు టొవినో థామస్ నటించిన చిత్రమిది. మరి ‘మిన్నల్ మురళి కథేంటి? సూపర్ హీరో ఎలా అయ్యాడు?(minnal murali telugu movie review)
కథేంటంటే: ఉరవకొండ గ్రామంలో నివసించే జేసన్ (టొవినో థామస్)(Tovino Thomas) ఓ టైలర్. ఎప్పటికైనా అమెరికా వెళ్లాలని అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ కూతురిని ప్రేమించి విఫలమవుతాడు. అదే ఊళ్లో చిన్న హోటల్‌లో పని చేస్తుంటాడు శిబు (గురు సోమసుందరం). ఒకరోజు అనుకోకుండా వీరిద్దరూ మెరుపు దాడికి గురవుతారు. దీంతో ఇద్దరికీ ఊహించని శక్తులు వస్తాయి. ఆ శక్తులను వాళ్లు ఎలా గుర్తించారు? వాటిని ఎలా ఉపయోగించారు? వీరి శక్తుల కారణంగా ఆ గ్రామ ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు? పరిస్థితులు వీళ్లను ఎలా మార్చాయి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: వెండితెరపై కనిపించే సూపర్ హీరోలు, వాళ్లకు ఉండే శక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్వెల్, డీసీ కామిక్స్ ద్వారా ఎందరో సూపర్ హీరోలు ప్రపంచానికి పరిచయం అయ్యారు. అయితే, భారతీయ తెరపై సూపర్ హీరోలు పాత్రలు చాలా తక్కువ. మార్వెల్ సూపర్‌హీరో తరహాలో ఇక్కడి ప్రేక్షకులకు ఒక సూపర్ హీరో ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘మిన్నల్ మురళి’. అరుణ్ అనిరుధన్, జస్టిన్ మాథ్యూల సూపర్‌హీరో కథను భారతీయ నేటివిటీకి దగ్గరగా తెరకెక్కించడంలో దర్శకుడు బాసిల్ జోసెఫ్ విజయవంతమయ్యారు. ఇటు జేసన్, అటు శిబు పాత్రలను పరిచయం చేస్తూ త్వరగానే కథలోకి తీసుకెళ్లిపోయారు. ఇద్దరూ మెరుపుదాడికి గురైన తర్వాత తమకు శక్తులు వచ్చాయని గుర్తించటం, వాటిని ఉపయోగించడం సరదాగా అనిపిస్తుంది. తన శక్తులను పరీక్షించుకునేందుకు జేసన్ చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. సూపర్‌హీరో కథ కాబట్టి దర్శకుడు కూడా నేలవిడిచి సాము చేయలేదు. బడ్జెట్, భారతీయ నేటివిటికీ దగ్గరగా సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది.

సాధారణంగా డీసీ కామిక్స్‌లో విలన్స్ వికృత రూపాల్లో, అత్యంత శక్తిమంతులుగా కనిపిస్తారు. కానీ, ‘మిన్నల్ మురళి’లో జేసన్, శిబులకు ఎదురయ్యే పరిస్థితులే ప్రధాన శత్రువులు. అవే వారిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా శిబు తనకు ఎదురయ్యే సవాళ్లను తప్పించుకునేందుకు జేసన్‌ను బలి చేయాలనుకోవటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. తనని ఎవరు టార్గెట్ చేశారన్న విషయాన్ని తెలుసుకునేందుకు జేసన్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ సృష్టించి ఆద్యంతం ఆసక్తి కలిగించేలా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే, ప్రథమార్ధంలో కథా గమనం నెమ్మదిగా సాగడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. చివరి 40 నిమిషాలు సినిమా పరుగులు పెట్టినా, ప్రేక్షకుడి ఊహకు తగినట్లే సన్నివేశాలు సాగుతాయి. పతాక సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి.

ఎవరెలా చేశారంటే: మలయాళంలో ఉన్న విలక్షణ నటుల్లో టొవినో థామస్ ఒకడు. ఇప్పటివరకూ అతడు నటించిన చిత్రాల్లో అత్యధిక భాగం ప్రయోగాలే. భారతీయ చిత్ర పరిశ్రమలో ‘మిన్నల్ మురళి’ సరికొత్త ప్రయోగం. సూపర్‌హీరో పాత్రలో టొవినో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర గురు సోమసుందరం. శిబు పాత్రలో ఆయన నటన, పలికించిన హావభావాలు అద్భుతం. ఎన్ని శక్తులు ఉన్నా విధిని ఎదిరించి నిలబడటం ఎవరికీ సాధ్యం కాదన్నది శిబు పాత్ర ద్వారా చూపించారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సుశీన్ నేపథ్య సంగీతం, సమీర్ సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే. ఎడిటర్ లివింగ్‌స్టన్ సినిమాను ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. ముఖ్యంగా ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఓ సరికొత్త హీరోను భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడంలో విజయం సాధించారు. జేసన్, శిబు పాత్రలను తీర్చిదిద్దిన విధానం, తెరపై వారి పాత్రల మధ్య చోటు చేసుకునే సంఘర్షణ చాలా చక్కగా తీశారు. సీక్వెల్ తెరకెక్కించేలా ముగింపు ఇవ్వడం గమనార్హం. ఈ వీకెండ్ కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకుంటే ‘మిన్నల్ మురళి’ నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న బెస్ట్ ఆప్షన్.
బలాలు
+ టొవినో థామస్, గురు సోమ సుందర్‌ల నటన
+ కథ, దర్శకత్వం
+ ద్వితీయార్ధం
బలహీనతలు
- నెమ్మదిగా సాగే ప్రథమార్ధం
చివరిగా: ‘మిన్నల్ మురళి’ ఎంటర్‌టైన్ చేసే ఇండియన్ సూపర్ హీరో!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

రివ్యూ: మాస్ జాతర.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా?
రవితేజ, శ్రీలీల జంటగా నటించి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? - 
                                    
                                        

రివ్యూ: కొత్తలోక.. రికార్డు నెలకొల్పిన మలయాళ మూవీ ఓటీటీలో
కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హీరో మూవీ ‘కొత్తలోక’. ప్రస్తుతం ఓటీటీ వేదికగా సందడి చేస్తోంది. - 
                                    
                                        

‘బాహుబలి: ది ఎపిక్’ రివ్యూ.. రెండు భాగాలను కలిపి జక్కన్న ఎలా మలిచారంటే!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలను ఆయన ఎలా మలిచారంటే.. - 
                                    
                                        

రివ్యూ: మిరాజ్.. ఒక్క సినిమాలో ఇన్ని ట్విస్ట్‌లా.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘మిరాజ్’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? - 
                                    
                                        

రివ్యూ: బైసన్.. విక్రమ్ కుమారుడి సినిమా ఎలా ఉందంటే..
విక్రమ్ కుమారుడు నటించిన బైసన్ సినిమా ఎలా ఉందంటే.. - 
                                    
                                        

రివ్యూ: థామా.. రష్మిక హారర్ కామెడీ ఫిల్మ్ మెప్పించిందా?
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ‘థామా’ ఎలా ఉంది? - 
                                    
                                        

రివ్యూ: కె- ర్యాంప్.. కిరణ్ అబ్బవరం రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సినిమా ‘కె- ర్యాంప్’. ఈ సినిమా శనివారం విడుదలైంది. - 
                                    
                                        

రివ్యూ: డ్యూడ్.. ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా?
Google trends: ప్రదీప్ రంగనాథన్ నటించిన కొత్త సినిమా ‘డ్యూడ్’. ఈ సినిమా ఎలా ఉందంటే? - 
                                    
                                        

రివ్యూ: తెలుసు కదా.. సిద్ధు జొన్నలగడ్డ మూవీ ఎలా ఉందంటే?
సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘తెలుసు కదా’. - 
                                    
                                        

రివ్యూ: మిత్ర మండలి.. యూత్ ఎంటర్టైనర్ ఎలా ఉంది?
ప్రియదర్శికి విష్ణు, రాగ్ మయూర్, నిహారిక.ఎన్.ఎమ్ కీలక పాత్రల్లో నటించిన ‘మిత్ర మండలి’ ఎలా ఉందంటే? - 
                                    
                                        

రివ్యూ: శశివదనే.. రక్షిత్, కోమలి రొమాంటిక్ డ్రామా ఎలా ఉంది?
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఎలా ఉంది? - 
                                    
                                        

రివ్యూ: అరి; సాయికుమార్, అనసూయల మూవీ ఎలా ఉంది?
‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో మూవీ ‘అరి’ ఎలా ఉంది? - 
                                    
                                        

వెబ్‌సిరీస్ రివ్యూ: ది గేమ్: యు నెవ్వర్ ప్లే ఎలోన్.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
శ్రద్ధాశ్రీనాథ్ కీలక పాత్రలో నటించిన ది గేమ్: యు నెవ్వర్ ప్లే ఎలోన్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? - 
                                    
                                        

రివ్యూ: కాంతార: చాప్టర్-1.. రిషబ్‌శెట్టి మైథలాజికల్ ఫిల్మ్ ఎలా ఉంది?
రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార: చాప్టర్-1’ ఎలా ఉంది? - 
                                    
                                        

రివ్యూ: ఇడ్లీ కొట్టు.. ధనుష్ విలేజ్ యాక్షన్ డ్రామా ఎలా ఉంది?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఇడ్లీ కొట్టు తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? - 
                                    
                                        

రివ్యూ: హృదయపూర్వం.. మలయాళంలో రూ.100 కోట్లు వసూలు.. ఎలా ఉంది?
మోహన్‌లాల్ కీలక పాత్రలో సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా మెప్పించిందా? - 
                                    
                                        

రివ్యూ: ఓజీ.. పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉంది?
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? - 
                                    
                                        

రివ్యూ: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్.. షారుక్ తనయుడి మేకింగ్ ఎలా ఉందంటే?
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ దర్శకత్వం వహించిన వెబ్‌సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే? - 
                                    
                                        

రివ్యూ: భద్రకాళి.. విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం మెప్పించిందా?
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా అరుణ్ ప్రభు దర్శకత్వంలో నటించిన ‘భద్రకాళి’ ఎలా ఉంది? - 
                                    
                                        

రివ్యూ: బ్యూటీ.. మారుతి నిర్మించిన ప్రేమకథా చిత్రం ఎలా ఉందంటే?
అంకిత్ కొయ్య, నీలఖి, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బ్యూటీ’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందంటే? 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 - 
                        
                            

అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే రూ.1,000 ఇచ్చారు: మిథాలి రాజ్
 - 
                        
                            

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అపరెల్ గ్రూప్‌ను ఆహ్వానించిన మంత్రి నారాయణ
 


