Thalaivar 171: రజనీకాంత్‌- లోకేశ్‌ కాంబో టైటిల్‌ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?

రజనీకాంత్‌ కొత్త సినిమా టైటిల్‌ ఖరారైంది. అదేంటంటే?

Published : 22 Apr 2024 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర నటుడు రజనీకాంత్‌ (Rajinikanth)- దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. రజనీకాంత్‌కు ఇది 171వ సినిమా. ఇప్పటివరకు #Thalaivar 171 వర్కింగ్‌ టైటిల్‌గా ఉంది. త్వరలోనే పేరును ప్రకటిస్తామంటూ కొన్ని రోజుల క్రితం టీమ్‌ ఆసక్తి రేకెత్తించింది. దీంతో, ‘తంగమ్‌’, ‘రాణా’ తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా టైటిల్‌ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అదే.. కూలీ. ఈమేరకు సోషల్‌మీడియా వేదికగా వీడియోను విడుదల చేసింది. 

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ తదితర సినిమాలతో విశేష క్రేజ్‌ సంపాదించుకున్న లోకేశ్‌.. రజనీకాంత్‌తో సినిమాని ప్రకటించడమే ఆలస్యం టాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరూ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో లోకేశ్‌ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇందులో రజనీకాంత్‌ పాత్ర మునుపెన్నడూ చూడనివిధంగా ఉంటుంది. కాస్త నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో ఆయన కనిపించే అవకాశం ఉంది. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. నా గత చిత్రాల్లో చూపించినట్లు మాదక ద్రవ్యాలను చూపించను’’ అని పేర్కొన్నారు. ఇందులో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), శ్రుతి హాసన్‌ (Shruti Haasan) కీలక పాత్రల్లో నటించే అవకాశాలున్నాయనేది సినీ వర్గాల సమాచారం. రజనీకాంత్‌ ప్రస్తుతం ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని