Rajinikanth: పేరు... ఆ రోజు

రజనీకాంత్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

Updated : 29 Mar 2024 11:54 IST

జనీకాంత్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా పేరుని, టీజర్‌ను ఏప్రిల్‌ 22న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ కథ సమయంతో ముడిపడినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లోనూ, రజనీ చేతికీ గడియారాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. జూన్‌ నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని