Vijay: దళపతి విజయ్‌ మంచి మనసు.. వారికి సన్మానం చేయనున్న హీరో

కోలీవుడ్‌ హీరో విజయ్‌ మరోసారి విద్యార్థులకు సాయం చేయనున్నారు. టెన్త్‌, ఇంటర్‌లో టాప్‌ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. 

Published : 11 Jun 2024 10:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ హీరో విజయ్ సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మరోసారి మంచి మనసు చాటుకోనున్నారు. ఇటీవల వెలువడిన టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ  ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు ప్రకటించారు.

గతేడాది ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థినికి విజయ్‌ (Vijay)  డైమండ్‌ నెక్లెస్‌ కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రవ్యాప్తంగా (Tamil Nadu) మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు కూడా మరోసారి విద్యార్థులకు సాయం చేయనున్నారు. ఈ ఏడాదిలో టాపర్లుగా నిలిచిన వారికి సర్టిఫికెట్‌తో పాటు రివార్డులను అందజేయనున్నారు. జూన్‌ 28, జులై 3తేదీల్లో చెన్నై వేదికగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌లో టాప్‌ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. ఇక ఇటీవలే ఈ హీరో కొత్త రాజకీయ పార్టీని (Tamilaga Vettri Kazhagam) ప్రకటించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

భయపడకు... మరో ప్రపంచం వస్తోంది

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్‌ (Thalapathy Vijay)  ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌)తో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడారు. ఈ టెక్నాలజీతో ఆయన్ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు.  ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’ లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌కి పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’ కోసం వర్క్‌ చేశారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని