Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్‌

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఇది నిర్మితం కానుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

Updated : 09 Dec 2023 19:08 IST

హైదరాబాద్‌: నాగచైతన్య (Naga Chaitanya) - సాయిపల్లవి (Sai pallavi) జంటగా నటిస్తోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఇది నిర్మితం కానుంది. ఓ మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని, సినిమాటిక్‌గా చెబుతున్న కథ ఇది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. వెంకటేశ్‌, నాగార్జున ముఖ్య అతిథులుగా పాల్గొని టీమ్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nayanthara: నన్ను అలా పిలిస్తే తిట్టినట్లు ఉంటుంది..: నయనతార

‘‘గత ఏడాదిన్నర నుంచి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ‘తండేల్‌’ విభిన్నమైన ప్రపంచంలోకి  తీసుకువెళ్తుంది. అందుకోసం  దర్శకుడు చందు, నటుడు నాగచైతన్యతో టీమ్‌ అందరూ ఎంతో శ్రమించారు. సాధారణంగా ఒక దర్శకుడు హిట్‌ అందుకుంటే వెంటనే అతడికి వరుస అవకాశాలు వస్తాయి. వాటన్నింటినీ వదులుకుని మొదట ఇచ్చిన కమిట్‌మెంట్‌ కోసం నిలబడేవారు చాలా తక్కువమంది ఉంటారు. ‘కార్తికేయ 2’ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ మా సంస్థతోనే చేయాలనే కమిట్‌మెంట్‌పై చందు నిలబడ్డాడు. ఈ కథను సిద్ధం చేసి దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో హోంవర్క్‌ చేశాడు. భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తోన్న ఈచిత్రాన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నాం. ఇక, ‘తండేల్‌’ అనే టైటిల్‌ను ప్రకటించిన నాటి నుంచి దాని అర్థం తెలుసుకునేందుకు  ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. అలాగే, ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొన్నాళ్లు ఆ సందేహాలను అలాగే ఉంచండి. అన్నింటికీ మా సినిమాతో సమాధానం చెబుతాం’’ అని అల్లు అరవింద్‌ అన్నారు.

అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ.. తన కెరీర్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న ‘100%లవ్‌’ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పైనే నిర్మితమైందన్నారు. ‘తండేల్‌’ కోసం ఈ బ్యానర్‌లో వర్క్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రమని తెలిపారు. ‘లవ్‌స్టోరీ’ తర్వాత ఈసినిమా కోసం సాయిపల్లవితో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని