The Kerala Story: ఓటీటీలో ‘ది కేరళ స్టోరీ’ రికార్డు.. వాచ్‌ టైం ఎంతంటే!

సుదీప్తోసేన్‌ దర్శకత్వంలో అదాశర్మ ప్రధానపాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలో రికార్డు సృష్టించింది

Published : 03 Mar 2024 13:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). సినీ రంగంలోనే కాదు, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న  ‘జీ5’ వేదికగా ఓటీటీలోకి వచ్చింది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. స్ట్రీమింగ్‌ అవుతోన్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్ వన్‌లో కొనసాగుతోంది. మొత్తం 300 మిలియన్ల వాచ్‌ మినిట్స్‌ మైలు రాయిని కూడా దాటేసినట్లు తెలుపుతూ జీ5 పోస్టర్‌ విడుదల చేసింది. థియేటర్లో విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. దీంతో అంచనాలకు మించిన వ్యూస్‌ను సాధిస్తోంది.

 అంబానీ ఈవెంట్‌లో ‘నాటునాటు’ పాట.. స్టెప్పేసిన బాలీవుడ్‌ త్రయం

నేపథ్యమిదే..

దర్శకుడు సుదీప్తోసేన్‌ ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ యువతులు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో రూపొందించారు. ఓ నలుగురు ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతగా విపుల్‌ అమృత్‌లాల్‌ షా వ్యవహరించారు. గతంలో ‘అస్మా’, ‘లఖ్‌నవూ టైమ్స్‌’, ‘ది లాస్ట్‌ మాంక్‌’ వంటి చిత్రాలు నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని