Tiger Nageswara rao: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ రన్‌టైమ్‌లో మార్పులు.. అరగంట తగ్గింపు..!

స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara rao). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విషయంలో చిత్రబృందం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 21 Oct 2023 18:44 IST

హైదరాబాద్‌: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara rao) చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రన్‌టైమ్‌లో మార్పులు చేసింది. సుమారు అరగంట నిడివిని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2.37 గంటల రన్‌టైమ్‌తో ఇకపై ఇది ప్రేక్షకులను అలరించనుంది. సినీ ప్రియుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకునే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రివ్యూ: టైగర్‌ నాగేశ్వరరావు.. రవితేజ ఖాతాలో హిట్‌ పడిందా?

స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్‌ ఖేర్‌, నుపుర్‌ సనన్‌, రేణు దేశాయ్‌, జిషుసేన్‌ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్‌, నాజర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 3.02 గంటల నిడివితో ఈ సినిమా సిద్ధమైంది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. కథా, కథనం, నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ నిడివి ఎక్కువగా ఉందని సినీ ప్రియులు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి సారించిన చిత్రబృందం రన్‌టైమ్‌ను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు