Tillu Square: టిల్లు స్క్వేర్‌ రన్‌ లాక్‌.. మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉంటుందా?

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ గురించి ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Published : 24 Feb 2024 21:15 IST

హైదరాబాద్‌: ట్రైలర్‌తోనే తన సినిమాపై అంచనాలను పెంచేశారు యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). అనుపమ పరమేశ్వర్‌ (Anupama Parameswaran) కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈక్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇందులోభాగంగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మూవీ రన్‌ టైమ్‌ విషయంలో చిత్రబృందం స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు గంటలా 1 నిమిషం...  అంటే 121 నిమిషాల పాటు సినిమా ఉంటుందట. ప్రస్తుతం వస్తున్న సినిమాలతో పోలిస్తే రన్‌ టైమ్‌ కాస్త తక్కువే అయినా, థియేటర్‌లో కూర్చొన్న తర్వాత రోలర్‌ కోస్టర్‌ ఎక్కినట్లు ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్‌ సీన్‌ నుంచి లాస్ట్‌ సీన్‌ వరకూ నవ్వుల టపాసులు పేలుతూనే ఉంటాయట. సిద్ధు స్వాగ్‌.. అనుపమ హాట్‌ సీన్స్‌.. పంచ్ డైలాగ్స్‌ ఇలా సినిమా మొత్తం సందడిగా ఉంటుందని అంటున్నారు.

తళుక్కున మెరవనున్న రాధిక..

‘డీజే టిల్లు’లో రాధికగా నటించి మెప్పించింది నేహాశెట్టి (Neha Shetty). ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్‌’లో ఆ పాత్ర తళుక్కున మెరవబోతోందని అంటున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు నేహా తెరపై కనిపిస్తుందట. తొలి భాగాన్ని మించి ఆ పాత్ర మెరుపులు మెరుస్తుందని చెబుతున్నారు. సీక్వెల్ ప్రకటించినప్పుడు కథానాయికగా నేహాశెట్టి ఉంటుందని చాలామంది అనుకున్నారు. అయితే, టిల్లు లైఫ్‌లో ఓ కొత్త అమ్మాయి తారసపడి ఆమె వల్ల ఇబ్బందులు ఎదురైతే వచ్చే ఫన్‌ వేరేలా ఉంటుంది. అందుకనే అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. లిల్లీ పాత్రకు అనుపమ వందకు రెండు వందలశాతం ఎఫెర్ట్‌ పెట్టింది. ఇప్పటివరకూ అనుపమను ఇలాంటి హాట్‌ రోల్‌లో ప్రేక్షకుడు చూడలేదు. ఆమెను అభిమానించే కొందరైతే గుండెలు పగిలేలా బాధపడుతున్నారు. మరి ఇటు అనుపమ, అటు అతిథిగా మెరిసే రాధికతో టిల్లు పడే ఇబ్బందులేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని