Tollywood: దసరాకి శ్రీకారం

విజయదశమి వేళ ఏ పని ప్రారంభించినా విజయమే వరిస్తుందన్నది అందరి నమ్మకం. అందుకే ఈ పండగ వేళ కొత్త చిత్రాలకు శ్రీకారం చుట్టడానికి సినీతారలంతా ఆసక్తి చూపిస్తుంటారు.

Updated : 14 Oct 2023 13:34 IST

విజయదశమి వేళ ఏ పని ప్రారంభించినా విజయమే వరిస్తుందన్నది అందరి నమ్మకం. అందుకే ఈ పండగ వేళ కొత్త చిత్రాలకు శ్రీకారం చుట్టడానికి సినీతారలంతా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ పండక్కి క్లాప్‌ చప్పుళ్లు మరింత గట్టిగా వినిపించనున్నాయి. ప్రస్తుతం హీరో నాని ‘హాయ్‌ నాన్న’ సినిమాతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు. దీని తర్వాత ఆయన వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ దసరా సందర్భంగానే లాంఛనంగా మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ‘డాన్‌ శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ సినిమాలతో హ్యాట్రిక్‌ హిట్లు కొట్టారు రవితేజ - గోపీచంద్‌ మలినేని. ఇప్పుడీ కలయికలో మరో కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పండగ రోజునే క్లాప్‌ కొట్టుకోనుందని సమాచారం. ఇక రానా కథానాయకుడిగా తేజ తెరకెక్కించనున్న కొత్త చిత్రం ‘రాక్షస రాజు’. ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్‌ విజయ దశమి సందర్భంగానే పట్టాలెక్కనుందని తెలిసింది. వీటితో పాటే సిద్ధు జొన్నలగడ్డ - నీరజ కోనల కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమా కూడా పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని టాక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని