Triptii Dimri: ‘యానిమల్‌’లో శృంగార సన్నివేశాలపై స్పందించిన త్రిప్తి..

ప్రేక్షకులు ఏమనుకుంటారోనని ఆలోచిస్తే మనం చేయాలనుకున్నది చేయలేమని నటి త్రిప్తి డిమ్రి అన్నారు.

Published : 01 Mar 2024 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది సూపర్ హిట్‌ సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది ‘యానిమల్‌’. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని నటీనటులకూ మంచి గుర్తింపు వచ్చింది. వారిలో త్రిప్తి డిమ్రి (Tripti Dimri) ఒకరు. ఈ సినిమా తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. కొందరు మాత్రం ఇందులో ఆమె నటించిన సన్నివేశాలపై ట్రోలింగ్‌ చేశారు. తాజాగా దీనిపై త్రిప్తి స్పందించారు.

‘‘సందీప్‌ వంగా స్టోరీ చెప్పినప్పుడే నాది చాలా చిన్న పాత్ర అని స్పష్టంగా చెప్పారు. ఆ పాత్ర ఆసక్తికరంగా అనిపించింది. ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మన నిర్ణయాలు మార్చుకుంటే మనం చేయాలనుకున్నది ఎప్పటికీ చేయలేం. ఎప్పుడూ సౌకర్యవంతమైన పాత్రలే చేయాలని నేను అనుకోను. ‘యానిమల్‌’లో నేను నటించిన శృంగార సన్నివేశాలు చూసి నా తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. సినిమాకు ఆ సీన్‌ ఎంత ముఖ్యమో వారికి వివరించాను. గతంలో నా తొలి చిత్రం విడుదల తర్వాత మా నాన్న నేను నటినని అందరితో గర్వంగా చెప్పాలనుకున్నారు. అప్పుడు నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ చిత్రంతో నన్ను అందరూ గుర్తుపడుతున్నారు’’ అని చెప్పారు.

‘కల్కి’లో మరో తెలుగు నటుడు.. ఇంతకీ ఆయన ఎవరంటే?

ఈ ‘యానిమల్’ బ్యూటీ ప్రస్తుతం ‘మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌’, ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ (Ravi teja) హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని