Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్‌’పై పోస్ట్‌ తొలగించిన త్రిష

నెటిజన్ల నుంచి వస్తోన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ‘యానిమల్‌’ (Animal)పై పెట్టిన పోస్ట్‌ను నటి త్రిష (Trisha) తొలగించారు.

Published : 04 Dec 2023 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ‘యానిమల్‌’ (Animal) ఫీవర్‌ నడుస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాపై నటి త్రిష (Trisha) పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. ఆమెను విమర్శిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె విమర్శలు ఎదుర్కొవడానికి గల కారణం ఏమిటంటే..!

ఈవారం థియేటర్‌/ఓటీటీల్లో.. అలరించే సినిమాలు, సిరీస్‌లివే

రణ్‌బీర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’. హింస తీవ్ర స్థాయిలో ఉన్న ఈ సినిమా తమకెంతో నచ్చిందంటూ ఇప్పటికే పలువురు నటీనటులు తెలిపారు. ఇదిలా ఉండగా, తాజాగా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటి త్రిష. ‘యానిమల్‌’ పోస్టర్‌ షేర్‌ చేసి ‘కల్ట్‌ మూవీ’ అని ప్రశంసిస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వివాదం జరిగినప్పుడు మహిళల గౌరవం గురించి అంతలా మాట్లాడిన త్రిష.. స్త్రీని తక్కువ చేసి చూపించే ఇలాంటి చిత్రాలను మెచ్చుకోవడం ఏం బాలేదంటూ విమర్శించారు. పోస్ట్‌కు వస్తోన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని త్రిష ఇన్‌స్టా స్టోరీని తొలగించినట్లు తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని