Upcoming Telugu Movies: ఈవారం థియేటర్‌/ఓటీటీల్లో.. అలరించే సినిమాలు, సిరీస్‌లివే

Upcoming telugu movies: డిసెంబరు తొలి శుక్రవారం విడుదలైన ‘యానిమల్‌’ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. దాంతోపాటు ‘అథర్వ’, ‘కాలింగ్‌ సహస్ర’లాంటి చిన్న చిత్రాలూ బాక్సాఫీసు ముందుకొచ్చాయి. మరి, ఈవారం థియేటర్‌, ఓటీటీల్లో ఏయే సినిమాలు రాబోతున్నాయో చూసేయండి..

Updated : 04 Dec 2023 10:02 IST

తండ్రీకూతుళ్ల అనుబంధం..

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). నాని (Nani) హీరో. మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌. శ్రుతిహాసన్‌ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పలువురు కొత్త దర్శకులను పరిచయం చేసిన నాని ఈ సినిమాతో శౌర్యువ్‌ని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ‘హాయ్‌ నాన్న’.. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, వైలెన్స్‌ లేని క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర బృందం తెలిపింది. 2: 05 గంటల నిడివితో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో డిసెంబరు 7న విడుదల కానుంది.


జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నవ్వులు పంచేందుకు..

జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నవ్వులు పంచేందుకు ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ (Extra: OrdinaryMan)తో సిద్ధమయ్యారు నటుడు నితిన్‌ (Nithiin). ఈయన హీరోగా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రమిది. శ్రీలీల (Sree Leela) కథానాయిక. ప్రముఖ హీరో రాజశేఖర్‌ (Rajasekhar) కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు తాను పోషించిన పాత్రల్లో ఈ సినిమాలోని పాత్రే ది బెస్ట్‌ అని నితిన్‌ తెలిపారు. ఈ చిత్రం చూస్తున్నంతసేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి విభిన్న కథతో ఇప్పటి వరకు ఎలా సినిమా చేయలేదని వంశీ పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘చండిక’

వీరు, శ్రీహర్ష, కుషి చౌహన్‌, నిషా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చండిక’ (Chandika). హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది.  తోట కృష్ణ దర్శకుడు. కె.వి.పాపారావు నిర్మాత. ఈ సినిమా డిసెంబర్‌ 8న విడుదల కానుంది. 


ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లివే!

స్టార్‌ కిడ్స్‌ సందడి..

బాలీవుడ్‌ స్టార్ల వారసులు పలువురు కలిసి నటించిన చిత్రం ‘ది అర్చీస్‌’ (The Archies). ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌- శ్రీదేవి దంపతుల రెండో కుమార్తె ఖుషి కపూర్‌, అగ్ర నటుడు షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌, మరో అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నంద తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జోయా అక్తర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో డిసెంబరు 7న విడుదల కానుంది. 


 • ఆహా

 • ‘మా ఊరి పొలిమేర 2’: డిసెంబరు 8 (‘ఆహా గోల్డ్‌’ చందాదారులకు డిసెంబరు 7 నుంచే అందుబాటులో ఉండనుంది)
 • నెట్‌ఫ్లిక్స్‌
 • ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’: డిసెంబరు 8 (తెలుగు సహా పలు భాషల్లో)
 • లీవ్‌ ది వరల్డ్‌ బిహైండ్‌ (హాలీవుడ్‌): డిసెంబరు 8
 • ధక్‌ ధక్‌ (హిందీ): డిసెంబరు 8

 • డిస్నీ+ హాట్‌స్టార్‌
 • వధువు (వెబ్‌సిరీస్‌): డిసెంబరు 8 (తెలుగు సహా పలు భాషల్లో)
 • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
 • మస్త్‌ మే రహ్నే కా (హిందీ): డిసెంబరు 8

 • జీ5
 • కడక్‌ సింగ్‌ (హిందీ): డిసెంబరు 8
 • సోనీలివ్‌
 • చమక్‌ (వెబ్‌సిరీస్‌): డిసెంబరు 7
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని