upcoming movies: వేసవి సందడి షురూ.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

upcoming movies in telugu: పరీక్షలు దాదాపు ముగిశాయి.. ఎండలు పెరిగాయి.. మండు వేసవిలో చల్లని వినోదాన్ని పంచడానికి సినిమాలు సిద్ధమయ్యాయి.  మరి ఏప్రిల్‌ మొదటి వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు రాబోతున్నాయి? చూసేయండి

Updated : 01 Apr 2024 10:14 IST

మరోసారి హిట్‌ కాంబినేషన్‌

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (mrunal thakur) జంటగా నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా ‘ఫ్యామిలీస్టార్‌’ (family star). పరశురామ్‌ దర్శకుడు. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గీత గోవిందం’తో విజయ్‌, పరశురామ్‌ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ‘మనలో చాలా మంది ఫ్యామిలీ స్టార్స్‌ ఉంటారు. ఈ సినిమా చూశాక అందరూ అలా కావాలని కోరుకుంటారు. ఇందులో విజయ్‌ పాత్రని క్లాస్‌, మాస్‌ మేళవింపుగా మంచి వినోదం, భావోద్వేగాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ వేసవి మొత్తం ఈ సినిమా వినోదం పంచుతుంది’అని చిత్ర బృందం చెబుతోంది.


జీవితంపై సినిమా ప్రభావం

సూర్యతేజ ఏలే కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam movie). మీనాక్షి గోస్వామి కథానాయిక. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. పాయల్‌ సరాఫ్‌ నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా ప్రభావితం చేసిందన్నది కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, సలీం ఫేకు తదితరులు కీలక పాత్రలు పోషించారు.


వినూత్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌

హర్షివ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’ (Bahumukham Movie). గుడ్‌, బ్యాడ్‌ అండ్‌ యాక్టర్‌.. అన్నది ఉపశీర్షిక. స్వర్ణిమా సింగ్‌, మరియా మార్టినోవా కథానాయికలు. ‘ఇదొక వినూత్నమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌. అట్లాంటా, కాంటన్‌, జార్జియా, యుఎస్‌ఏ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం’అని చిత్ర బృందం చెబుతోంది. ఏప్రిల్‌ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మలయాళంలో ఆల్‌టైమ్‌ రికార్డ్స్‌ బ్రేక్‌ చేసి..

మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో తొలి స్థానం కైవసం చేసుకుంది ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys). తక్కువ బడ్జెట్‌తో రూపొంది, రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పుడా హిట్‌ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సిద్ధమయ్యాయి. అదే టైటిల్‌తో ఏప్రిల్‌ 6న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల విడుదల చేస్తున్నారు.


ఏడేళ్ల తర్వాత తెలుగులో వస్తోంది..

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం ‘మాయవన్‌’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏడేళ్ల కిందట అక్కడ విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు ‘ప్రాజెక్ట్‌-Z’ (Project Z) పేరుతో ఏప్రిల్‌ 6న విడుదల చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో  సీవీ కుమార్ దీన్ని తెరకెక్కించారు.  జాకీష్రాఫ్, దివంగత నటుడు డేనియల్ బాలాజీ, జయ ప్రకాష్, దర్శకుడు కే ఎస్ రవికుమార్, మైమ్ గోపీ, భాగవతి పెరుమాళ్ కీలక పాత్రలు పోషించారు. సందీప్‌కిషన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు.


ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!

 • నెట్‌ఫ్లిక్స్‌
 • టు గెదర్‌ (వెబ్‌సిరిస్‌) ఏప్రిల్‌ 2
 • ఫైల్స్‌ ఆఫ్‌ ది అన్‌ ఎక్స్‌ప్లైన్డ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 03
 • రిప్‌లే (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 4
 • పారాసైట్‌: దిగ్రే (కొరియన్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 05
 • స్కూప్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 05
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • మ్యూజికా (హాలీవుడ్) ఏప్రిల్‌ 04
 • యే మేరీ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌-3) ఏప్రిల్‌ 04
 • హౌ టూ డేట్‌ బిల్లీ వాల్ష్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 05
 • జీ5
 • ఫర్రే (హిందీ) ఏప్రిల్‌ 05
 • ఆపిల్ టీవీ ప్లస్‌
 • లూట్‌ (వెబ్‌సిరీస్‌2) ఏప్రిల్‌ 03
 • సుగర్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 05
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • లంబసింగి (తెలుగు) ఏప్రిల్‌ 02
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని