upcoming movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

upcoming telugu movies: ఈ వారం పలు చిన్న చిత్రాలు థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 19 Feb 2024 10:10 IST

‘సుందరం మాస్టర్‌’గా నవ్వులు పంచేందుకు..

హాస్య నటుడిగా ప్రేక్షకులకు దగ్గరైన హర్ష చెముడు ఇప్పుడు ‘సుందరం మాస్టర్‌’గా (Sundaram Master) వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన.. దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్‌’ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కుటుంబ సమేతంగా చూసే చిత్రం..

అభినవ్‌ గోమఠం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnay Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్‌ భాస్కర్‌, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరో సరికొత్త ప్రేమకథ..

బాల నటుడిగా పలు చిత్రాలతో అలరించిన దీపక్‌ సరోజ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ (Siddharth Roy). తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘ముఖ్య గమనిక’

విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా ఛాయాగ్రాహకుడు వేణు మురళీధర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). రాజశేఖర్‌, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. లావణ్య కథానాయిక. ‘థ్రిల్లింగ్‌ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. విరాన్‌ చాలా చక్కగా నటించారు. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా’ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది.


సైరెన్‌ మోగేది ఆరోజే..

జయం రవి, అనుపమ పరమేశర్వన్‌, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘సైరెన్‌’ (Siren). ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భావోద్వేగాల మేళవింపుతో భారీ బడ్జెట్‌తో రూపొందించారు. తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్వర్‌ రెడ్డి మూలి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తిసురేష్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు.


‘ఓఎమ్‌జీ 2’ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల తార యామీ గౌతమ్‌. ఇప్పుడు ఆమె మరో సరికొత్త కథతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆర్టికల్‌ 370’ (article 370). ఆదిత్య సుహాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే

  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • అపార్ట్‌మెంట్‌ 404 (కొరియన్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 23
  • పోచర్‌ (తెలుగు డబ్బింగ్‌) - ఫిబ్రవరి 23

  • డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
  • విల్‌ ట్రెంట్‌ (వెబ్‌సిరీస్‌) - ఫిబ్రవరి 21
  • మలైకోట్టై వాలిబన్‌ (మలయాళం) - ఫిబ్రవరి 23
  • నెట్‌ఫ్లిక్స్‌
  • అవతార్‌: ది లాస్ట్‌ ఎయిర్‌బెండర్‌ (హాలీవుడ్‌) - ఫిబ్రవరి 22
  • బరీడ్‌ ట్రూత్‌ (హిందీ) - ఫిబ్రవరి 23
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని