upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?

ఈ వారం కూడా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Updated : 15 Apr 2024 13:01 IST

కిడ్నాప్‌ చేయడం ఓ కళ!

‘‘కిడ్నాప్‌ అనేది బయట క్రైమ్‌. కానీ, మా సినిమాలో అది ఓ కళ. అది ఎలాగనేది తెలుసుకోవాలంటే మా ‘పారిజాత పర్వం’ చూడాల్సిందే’’ అంటున్నారు సంతోష్‌ కంభంపాటి. ఆయన దర్శకత్వంలో చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘పారిజాత పర్వం’. కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌.. అన్నది ఉపశీర్షిక. మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ సంయుక్తంగా నిర్మించారు.  ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మట్టి మనుషుల జీవిత కథలతో..

నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘శరపంజరం’. లయ కథానాయిక. టి.గణపతిరెడ్డి నిర్మాణ సహకారం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల వెతల నేపథ్యంలో తీసిన చిత్రమిది’ అని మూవీ టీమ్‌ చెబుతోంది.


మాలాశ్రీ యాక్షన్‌ డ్రామా..

ఒకప్పటి కథానాయయిక మాలాశ్రీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రూపొందిన చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). శ్రావ్య కంబైన్స్ ప‌తాకంపై గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించారు. గతేడాది కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. పూర్తి యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది.


మరో వైవిధ్యమైన కథతో..

‘మై ఫ్రెండ్‌ గణేశా’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజీవ్‌ ఎస్‌. రియా. ఆ సినిమా మొదటి కంపోజిట్‌ యానిమేటెడ్‌ మూవీగా ప్రేక్షకాదరణను సైతం సొంతం చేసుకుంది.  ఇప్పుడు ‘లవ్‌ యూ శంకర్‌’ తెరకెక్కించారు.  ఏప్రిల్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.   శ్రేయాస్‌ తల్పాడే, తనీషా ముఖర్జీ జంటగా నటించారు.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • ఎనీవన్‌ బట్‌ యూ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 15
  • రెబల్‌ మూన్‌ 2 (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 19

డిస్నీ+ హాట్‌స్టార్‌

  • చీఫ్‌ డిటెక్టివ్‌ 1958 (కొరియన్‌) ఏప్రిల్‌ 19
  • సైరన్‌ (తెలుగు) ఏప్రిల్‌ 19

ఆహా

  • మై డియర్‌ దొంగ (తెలుగు) ఏప్రిల్‌ 19

బుక్‌ మై షో

  • డ్యూన్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 19

లయన్స్‌ గేట్‌ ప్లే

  • డ్రీమ్‌ సినారియో (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 19
  • ద టూరిస్ట్‌ (వెబ్‌సిరీస్‌2) ఏప్రిల్‌ 19

జియో సినిమా

  • పొన్‌ ఒండ్రు కేంద్రేన్‌ (తమిళ) ఏప్రిల్‌ 14
  • ది సింపథైజర్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 14

  • ఆర్టికల్‌ 370 (హిందీ) ఏప్రిల్‌ 19
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని