upcoming movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

upcoming movies in telugu: ఎప్పటిలోగా ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్‌, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ చిత్రం ఎప్పుడు వస్తోంది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది? చూసేయండి.

Updated : 12 Feb 2024 16:28 IST

భిన్నమైన కథతో ‘భ్రమయుగం’

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తున్న మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడు మరో భిన్నమైన కథతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రాహుల్‌ సదాశివన్‌ తీర్చిదిద్దారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


వాస్తవ సంఘటనలతో... రాజధాని ఫైల్స్‌

బిడ్డని పొదిగే గర్భంలో గొడ్డలి దించిన కర్కశత్వానికి... కోట్ల మంది కలల్ని, వేలాది మంది జీవితాల్ని కాలరాసిన నిరంకుశత్వానికి తెర రూపమే మా ‘రాజధాని ఫైల్స్‌’ (Rajdhani Files) అంటున్నారు కంఠంనేని రవిశంకర్‌. ఆయన నిర్మాణంలో.. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రమిది. భాను దర్శకత్వం వహిస్తున్నారు. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. మనసుల్ని కదిలించే కథ, కథనాలతో రూపొందుతోంది. ఫిబ్రవరి 15న విడుదల చేస్తున్నాం’ అని చిత్ర బృందం తెలిపింది. వినోద్‌కుమార్‌, వాణీ విశ్వనాథ్‌, పవన్‌, మధు, అజయ్‌రత్నం, అంకిత ఠాకూర్‌, అమృత చౌదరి తదితరులు నటిస్తున్నారు.


గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలు..

సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు.  ‘దర్శకుడు ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని ఓ ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళతారు’ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలు భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

 


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ ఓటీటీ వేదికగా విడుదలై ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ సిద్ధమైంది. అభిమన్యు తాడిమేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీరత్‌ కపూర్‌, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. అంతకన్నా ముందే తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


 • నెట్‌ఫ్లిక్స్‌
 • సండర్‌లెండ్‌ టిల్‌ ఐ డీ (వెబ్‌ సిరీస్‌3) ఫిబ్రవరి 13
 • లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌ సిరీస్‌6) ఫిబ్రవరి 14
 • ప్లేయర్స్‌ (హాలీవుడ్) ఫిబ్రవరి 14
 • ఐన్‌స్టీన్‌ అండ్‌ ది బాంబ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 16
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • ఫైవ్‌ బ్లైండ్‌ డేట్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 13
 • దిస్‌ ఈజ్‌ మీ.. నౌ (హాలీవుడ్) ఫిబ్రవరి 16
 • జీ5
 • క్వీన్‌ ఎలిజబెత్‌ (మలయాళం) ఫిబ్రవరి 14

 • ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్‌) ఫిబ్రవరి 16
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • ట్రాకర్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 12
 • సబ నయగన్‌ (తమిళ) ఫిబ్రవరి 14
 • ఓజ్లర్‌ (మలయాళం) ఫిబ్రవరి 15
 • సలార్‌ (హిందీ) ఫిబ్రవరి 16

 • నా సామిరంగ  (తెలుగు) ఫిబ్రవరి 17
 • సోనీ లివ్‌
 • రాయ్‌ సింఘానీ వర్సెస్‌ రాయ్‌సింఘానీ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 12
 • ఆహా
 • వీరమారి లవ్‌స్టోరీ (తమిళ) ఫిబ్రవరి 14
 • ఆపిల్‌ టీవీ ప్లస్‌
 • ది న్యూ లుక్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని