New telugu movies: జూన్‌ ఆఖరివారం.. థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

New telugu movies: బాక్సాఫీస్‌ వద్ద వినోదాల విందు కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీలోనూ పలు వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Published : 26 Jun 2023 09:52 IST

సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక మిస్టరీ..

నిఖిల్‌ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ (Spy). ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కె.రాజశేఖర్‌రెడ్డి కథని సమకూర్చడంతో పాటు, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు.


వినూత్న ప్రేమ కథగా..

‘సామజవరగమన’ (Samajavaragamana) అంటూ వినోదాలు పంచనున్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా రామ్‌ అబ్బరాజు తెరకెక్కించిన చిత్రమిది.  రాజేష్‌ దండా నిర్మాత. రెబా మోనికా జాన్‌ కథానాయిక. అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘వినూత్నమైన ప్రేమకథతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్‌, ఛాయాగ్రహణం: రాంరెడ్డి.


14ఏళ్ల తర్వాత...

యాక్షన్‌, అడ్వెంచర్‌ సినీ ప్రియులను ఎంతగానో అలరించాయి ‘ఇండియానా జోన్స్‌’ చిత్రాలు. నిధి వేట, అపురూప వస్తువులను అన్వేషించే కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ జానర్‌లో వస్తున్న మరో కొత్త చిత్రం ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’. ఇండియానా జోన్స్‌గా హారిసన్‌ ఫోర్డ్‌ మరోసారి అలరించనున్నారు. జూన్‌ 29న ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ థియేటర్‌లలో అలరించనుంది. ఇండియాన జోన్స్‌ సిరీస్‌లో దాదాపు 14ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రమిది.


దశరథ్‌ స్టైల్‌లో ‘లవ్‌ యూ రామ్‌’

‘చాలామంది ప్రేమించడమే జీవితం అనుకుంటారు. కానీ నమ్మించడమే జీవితం అంటాడు ఆ కుర్రాడు. చిన్నప్పట్నుంచి ఒకడినే ప్రేమిస్తూ అతనే రాముడు దేవుడు అని నమ్మి జీవితాన్ని అంకితం చేసింది ఆ అమ్మాయి. భిన్నమైన మనస్తత్వాలున్న ఈ ఇద్దరి ప్రేమకథ ఎక్కడిదాకా సాగింది? ఎక్కడ ముగిసిందో తెలియాలంటే ‘లవ్‌ యూ రామ్‌’ (Love You Ram) చూడాల్సిందే. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్ధనన్‌ జంటగా నటించిన చిత్రమిది. డి.వి.చౌదరి దర్శకత్వం వహించడంతోపాటు, కథని సమకూర్చిన ప్రముఖ దర్శకుడు కె.దశరథ్‌తో కలిసి నిర్మించారు. జూన్‌ 30న ఈ చిత్రం విడుదల కానుంది.


ఆసక్తికర కథాంశంతో..

పాయల్‌ రాజ్‌పుత్‌, సునీల్‌, శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాయా పేటిక (Maya Petika)’. రమేశ్‌ రాపార్తి దర్శకుడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్‌ 30న ‘మాయపేటిక’ థియేటర్‌లలో విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌

 • జాక్‌ ర్యాన్‌ (వెబ్‌సిరీస్‌ 4) జూన్‌ 30

నెట్‌ఫ్లిక్స్‌

 • టైటాన్స్‌ (వెబ్‌సిరీస్‌ 4) జూన్‌ 25
 • లస్ట్‌ స్టోరీస్‌ 2 (హిందీ) జూన్‌ 29

 • సీయూ ఇన్‌మై నైన్టీన్త్‌ లైఫ్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 29
 • అఫ్వా (హిందీ) జూన్‌30
 • సెలెబ్రిటీ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 30

డిస్నీ+హాట్‌స్టార్‌

 • వీకెండ్‌ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 28
 • ది నైట్‌ మేనేజర్‌ (సిరీస్‌2) జూన్‌30

 


బుక్‌ మై షో

 • ఫాస్ట్‌ ఎక్స్‌ (హాలీవుడ్‌) జూన్‌ 29

జియో సినిమా

 • సార్జెంట్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 30

ఆహా

 • అర్థమైందా అరుణ్‌కుమార్‌ (తెలుగు సిరీస్‌) జూన్‌ 30

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని