upcoming movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్‌లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి.

Published : 25 Mar 2024 09:54 IST

ఎడారిలో ఒంటరి ప్రయాణం..

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటించిన తాజాగా చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’. సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. బ్లెస్సీ దర్శకత్వం వహించారు. అమలాపాల్‌ కథానాయిక. ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా దీనిని రూపొందించారు. పూర్తిగా ఎడారిలో తెరకెక్కిన తొలి భారతీయ సినిమా ఇదే అని సినీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, నబీజ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ కొన్ని రోజుల పాటు మంచినీళ్లు, బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగి ఏకంగా 31 కిలోల బరువు తగ్గారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు?ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి?అన్న అంశాలను ఉద్విగ్నంగా చూపించనున్నారు. దాదాపు పదేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్‌ జరగడం విశేషం.


టిల్లు సందడి.. మీరంతా సిద్ధమా?

‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). దానికి కొనసాగింపుగా రూపొందిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక (Anupama Parameswaran). మల్లిక్‌రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తొలి భాగాన్ని మించేలా ‘టిల్లు స్క్వేర్‌’ వినోదాన్ని పంచుతుందని, యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా మూవీ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.


ఈసారి రెండూ కలిసి వస్తున్నాయి..

అటు గాడ్జిల్లా, ఇటు కింగ్‌కాంగ్‌ ఒకదానిపై ఒకటి విరుచుకుపడుతుంటే స్క్రీన్‌పై ఎలా ఉంటుందో కదా! అలాంటి విజువుల్‌ ట్రీట్‌నే అందించేందుకు సిద్ధమైంది ‘వార్నర్‌ బ్రదర్స్’‌. ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం  ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire). ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్‌ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో తెరకెక్కించారు. ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ మార్చి 29న విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలివే!

థియేటర్‌లో వినోదాన్ని పంచి..

వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది.


యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav OTT Release). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది.


ఓటీటీలో వస్తున్న ‘ట్రూ లవర్‌’

జై భీమ్‌.. గుడ్‌నైట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్‌ (manikandan), గౌరీ ప్రియ జంట‌గా ప్ర‌భురామ్ తెర‌కెక్కించిన చిత్రం ‘ట్రూ ల‌వ‌ర్‌’ (True Lover OTT Release). ఇటీవల తెలుగులో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో అరించేందుకు సిద్ధమైంది.  మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.


 • ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు (ott movies this week)
 • నెట్‌ఫ్లిక్స్‌
 • టెస్టామెంట్‌ (వెబ్‌సిరీస్) మార్చి 27
 • హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్) మార్చి 29
 • ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) మార్చి 29
 • ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) మార్చి 30
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • టిగ్‌ నొటారో (వెబ్‌సిరిస్‌)మార్చి 26
 • ది బాక్స్‌టర్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 28
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • పట్నా శుక్లా (హిందీ)మార్చి 29
 • రెనెగడె నెల్ల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 29
 • బుక్‌ మై షో
 • ది హోల్డోవర్స్‌ (హాలీవుడ్‌) మార్చి 29
 • జియో సినిమా
 • ఎ జెంటిల్‌మ్యాన్‌ ఇన్‌మాస్క్‌ (వెబ్‌సిరీస్‌)మార్చి 29
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని