upcoming movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

ఎన్నికలు, ఐపీఎల్‌ కారణంగా చిన్న సినిమాలకే పరిమితమైపోయింది వేసవి కాలం.  ఆ జోష్‌ను కొనసాగిస్తూ ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఏయే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయో చూసేయండి.

Updated : 11 Jun 2024 13:45 IST

సేతుపతి 50వ చిత్రం

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మహారాజ’. నిథిలన్‌ దర్శకుడు. అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి, మమత.. కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మహారాజ’ జూన్‌ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. అన్ని భాషల్లోని ప్రేక్షకులకూ నచ్చే భావోద్వేగాలున్న చిత్రమిది అని విజయ్‌ సేతుపతి అంటున్నారు.


పీరియాడిక్‌ యాక్షన్‌ ‘హరోం హర’

‘భయపడితే సింహాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు. అది భయపెడితేనే అడవికి రాజని ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు’ అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా జ్ఞానసాగర్‌ ద్వారక రూపొందించిన చిత్రం ‘హరోంహర’. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్‌ చిత్రమిది. సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ జీ నాయుడు నిర్మిస్తున్నారు. జూన్‌ 14 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


రాజధాని రౌడీగా యశ్‌

‘కె.జి.యఫ్‌’ చిత్రాలతో కథానాయకుడు యశ్‌ పేరు మార్మోగిపోయింది. అప్పట్నుంచి ఆయన పాత  సినిమాలన్నీ అనువాదాలై, వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆయన కన్నడలో చేసిన  చిత్రాల్లో ‘రాజధాని’ ఒకటి. అది ‘రాజధాని రౌడీ’ పేరుతో ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో యశ్‌కి జోడీగా షీనా నటించారు.


సూపర్‌ ఉమెన్‌ యాక్షన్‌ మూవీ

యానియా భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో స్టీఫెన్‌ తెరకెక్కిస్తున్న సూపర్‌   గర్ల్‌ సినిమా ‘ఇంద్రాణి’. కబీర్‌ దుహాన్‌ సింగ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భారతీయ సినీ చరిత్రలో మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్‌ షాట్స్‌, ఎంతో రిస్క్‌తో కత్తులను ఉపయోగించి చేసిన తొలి చిత్రమిది.  వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌కు కీలక ప్రాధాన్యం ఉంది’అని చిత్ర బృందం తెలిపింది.


మహిళా సాధికారత చాటి చెప్పేలా

చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్‌రాజ్, అషురెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘యేవమ్‌’. ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్, పవన్‌ గోపరాజు నిర్మాతలు. జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ‘మహిళ సాధికారితని చాటి చెప్పే చిత్రమిది. ప్రతి పాత్ర అర్థవంతంగా, కొత్తగా ఉంటుంది. విభిన్నమైన కథ, కథనాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ’ అని చిత్ర బృందం తెలిపింది.  నేరం చుట్టూ సాగే ఈ చిత్రంలో గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటించారు.


మూర్తి కలల ప్రయాణం

అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు.  ఇరవయ్యేళ్ల వయసులో కన్న కలలు, లక్ష్యాల కోసం యాభయ్యేళ్ల మూర్తి చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఆయన డీజే అయ్యాడా లేదా? అనే అంశాలతో ఈ చిత్రం రూపొందించారు. జూన్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లివే!

  • నెట్‌ఫ్లిక్స్‌
  • గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి జూన్‌ 14
  • మిస్టరీస్‌ ఆఫ్‌ ది టెర్రకోట వారియర్స్‌ (హలీవుడ్‌) జూన్‌ 12
  • బ్రిడ్జ్‌టన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 13
  • మహరాజ్‌ (హిందీ) జూన్‌ 14
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ది బాయ్స్‌ 4 (వెబ్‌సిరీస్‌) జూన్‌ 13
  • జీ5
  • పరువు (తెలుగు) జూన్‌ 14
  • లవ్‌ కీ అరెంజ్‌ మ్యారేజ్‌ (హిందీ) జూన్‌ 14
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ప్రొటెక్టింగ్‌ ప్యారడైజ్‌ (డాక్యుమెంటరీ) జూన్‌ 10
  • నాట్‌ డెడ్‌ యెట్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 12
  • ఆహా
  • పారిజాత పర్వం (తెలుగు) జూన్‌ 12
  • బుక్‌ మై షో
  • ది ఫాల్‌ గై (హాలీవుడ్‌) జూన్‌ 14
  • జియో సినిమా
  • గాంత్‌ (హిందీ) జూన్‌ 11
  • ఆపిల్‌ టీవీ ప్లస్‌
  • ప్రిజ్యూమ్‌డ్ ఇన్నోసెంట్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 12
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని