OTT movies: ధనుష్ ‘సార్’.. లారెన్స్ ‘చంద్రముఖి2’ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఫిక్స్!
Netflix movies: ఈ ఏడాది తమిళంలో విడుదలయ్యే పలు చిత్రాల ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన మూవీ బ్యాంక్‌లో కొత్త సినిమాల జోరును పెంచింది. ఒకప్పుడు ఓటీటీ సినిమాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video) వైపు చూసే వారు. కరోనా తర్వాత వివిధ భాషల్లోని సినిమాలను పలు ఓటీటీలు పోటీపడికొంటున్నాయి. థియేట్రికల్ రైట్స్‌కు దీటుగా బిజినెస్ జరుగుతుండటం కూడా నిర్మాతలకు కలిసి వస్తోంది. దీంతో సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే పలు ఓటీటీ వేదికలు డీల్ ఓకే చేసుకుంటున్నాయి. అలా 2023లో విడుదలకానున్న ఆసక్తికర చిత్రాల ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల వివరాలను ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ తాజాగా తమిళ్ మూవీల వివరాలను సైతం వెల్లడించింది. వీటిల్లో కొన్ని చిత్రాలు తమిళ/తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
- ధనుష్ (dhanush) కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సార్’ (Sir). సంయుక్తమేనన్ కథానాయిక. ఈ సినిమా థియేటర్‌లో విడుదలైన తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది.
- పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘తంగలాన్’ (thangalaan). విక్రమ్ (Vikram) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
- మహానటి తర్వాత కీర్తిసురేశ్ (keerthy suresh) పలు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించిన పెద్దగా మెప్పించలేకపోయారు. ‘చిన్ని’తో ఓకే అనిపించారు. ఇప్పుడు కె.చంద్ర దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రం ‘రివాల్వర్ రీటా’ (revolver rita). ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
- కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్ రూపొందిస్తున్న చిత్రం ‘జపాన్’ (japan). ఈ సినిమా కూడా థియేటర్‌లో విడుదలైన తర్వాత తెలుగు, తమిళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది.
- వీటితో పాటు, అజిత్ (Ajith) 62వ సినిమా, జయం రవి ‘ఇరైవన్’, లారెన్స్ ‘చంద్రముఖి2’ (chandramukhi 2), విష్ణు విశాల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’, సముద్రఖని ‘తలైకూతళ్’, ఫహద్ ఫాజిల్, కీర్తిసురేశ్ ‘మామనన్’, లారెన్స్, ఎస్‌జే సూర్యల ‘జిగర్తాండ: డబుల్‌ఎక్స్’ లైకా ప్రొడక్షన్స్ నిర్మించే ప్రొడక్షన్ నెం.18 (టి.అరుళ్) నెం.20(రోహిన్ వెంకటేశన్), 24 (హరీశ్ ప్రభు దర్శకుడు) చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా