Upcoming Movies in Telugu: థియేటర్‌ దద్దరిల్లేలా ఈ దసరా.. బాక్సాఫీస్‌/ఓటీటీ చిత్రాలివే!

Dasara Movies: ఈ దసరా ప్రేక్షకులకు వినోదాల విందు పంచేందుకు సిద్ధమైంది. తెలుగులో పలు ఆసక్తికర చిత్రాలు విడుదలవుతున్నాయి. అలాగే, ఓటీటీలోనూ మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేయండి.

Updated : 16 Oct 2023 18:09 IST

ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది

‘నేల కొండ భగవంత్‌ కేసరి.. ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది’ అంటున్నారు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (bhagavanth kesari). కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.


క్రేజీ కాంబినేషన్‌తో ‘లియో’

ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్‌ ఉన్న దర్శకుల్లో లోకేష్‌ కనగరాజ్‌ ఒకరు. విజయ్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లియో’ (Leo). త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 19న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. లోకేష్‌ దర్శకత్వం వహించిన ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ఎల్‌సీయూ(లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా వస్తుండటంతో ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి.


సరికొత్త పాత్రలో రవితేజ

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరించే కథానాయకుడు రవితేజ. మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న ఆయన ఓ బ్లాక్‌బస్టర్‌ చూసి చాలా నెలలే అయింది. ఈ క్రమంలో వంశీ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న బయోగ్రాఫికల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). స్టువర్టుపురం దొంగ అయిన టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ప్రచార చిత్రాల్లో రవితేజ నటన చూస్తుంటే, మాస్‌ను మెప్పించేలా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబరు 20న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.


గణపథ్‌.. ఎవరినీ వదిలిపెట్టడు

‘మన కోసం ఓ వీరుడు వచ్చే వరకు యుద్ధం మొదలు పెట్టొద్దు’ అంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌. మరి ఆ వీరుడు ఎవరు? ప్రజల కోసం ఎలాంటి సాహసాలు చేయబోతున్నాడనేది తెలియాలంటే ‘గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’ (Ganapath) సినిమా చూడాల్సిందే. బాలీవుడ్‌ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌, కృతిసనన్‌ జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కిస్తున్నారు.  అక్టోబరు 20న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/సిరీస్‌లివే!

మాన్షన్‌లో ఏం జరిగింది?

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) కీలకపాత్రలో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘మాన్షన్‌ 24’ (Mansion 24). ఓంకార్‌ (Ohmkar) దీనికి దర్శకత్వం వహించారు. ఓ పురాతన భవంతిలోకి వెళ్లిన వారందరూ మాయం కావడం అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీనిని తెరకెక్కించారు. సత్యరాజ్‌, అవికా గోర్‌, బిందు మాధవి, నందు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హాట్‌స్టార్‌ స్పెషల్‌గా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ అక్టోబర్ 17 నుంచి ప్రసారం కానుంది.

 • నెట్‌ఫ్లిక్స్‌
 • ఐ వోకప్‌ ఎ వ్యాంపైర్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 17
 • ది డెవిల్‌ ఆన్‌ ట్రైయల్‌ (హాలీవుడ్) అక్టోబరు 17
 • కాలాపానీ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 17
 • సింగపెన్నే (తమిళ చిత్రం) అక్టోబరు 18
 • బాడీస్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 19
 • నియో (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 19
 • డూనా (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 20
 • కందసామీస్‌: ద బేబీ (ఇంగ్లీష్‌ మూవీ) అక్టోబరు 20
 • ఓల్డ్‌ డాడ్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • పర్మినెంట్‌ రూమ్మేట్స్‌ (హిందీ సిరీస్‌) అక్టోబరు 18
 • ది అదర్‌ జోయ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20
 • ట్రాన్స్‌ఫార్మర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20
 • అప్‌లోడ్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 20
 • ఆహా
 • అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (టాక్‌ షో) అక్టోబరు 19
 • మామా మశ్చీంద్ర (తెలుగు) అక్టోబరు 20

 • సర్వం శక్తిమయం (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 20
 • రెడ్‌ శాండల్‌ వుడ్‌ (తమిళ చిత్రం) అక్టోబరు 20
 • బుక్‌ మై షో
 • టాక్‌ టూ మీ (హాలీవుడ్‌) అక్టోబరు 15
 • షార్ట్‌ కమింగ్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 17
 • ది నన్‌2 (హాలీవుడ్‌) అక్టోబరు 19
 • మై లవ్‌ పప్పీ (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 20
 • లయన్స్‌ గేట్‌ ప్లే
 • మాగీ మూర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 20
 • హైరిచ్‌
 • ఒరు థుళ్లి థాప్పా (మలయాళం) అక్టోబరు 20
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని