NTR: ఎన్టీఆర్‌తో ఊర్వశి ఫొటో.. అందుకు క్షమాపణ చెప్పిన నటి

బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌటెల.. ఎన్టీఆర్‌తో సెల్ఫీ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Updated : 15 Apr 2024 19:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) బాలీవుడ్‌కు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వార్‌2’ (War2). ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సెట్స్‌లోకి తారక్‌ అడుగుపెట్టారు. ఈక్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌటెల తన సోషల్‌మీడియా ఖాతా ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ఇద్దరూ కలిసి జిమ్‌లో దిగిన ఈ ఫొటోలో తారక్‌ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా కనిపించారు.

‘‘తారక్‌ గారు మన నిజమైన గ్లోబల్‌ స్టార్‌. మరీ ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నిజాయతీ, ముక్కుసూటితనం, అంతకుమించి ఎంతో వినమ్రత కలిగినవారు. మీరు చూపించే ప్రేమాభిమానం, స్ఫూర్తికి ధన్యవాదాలు. సింహం లాంటి మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. భవిష్యత్‌లో మీతో కలిసి నటించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. ఊర్వశి ఈ ఫొటో పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌ అయింది. ఇటీవల కాలంలో ఎన్టీఆర్‌ ఇలాంటి ఎనర్జిటిక్‌ లుక్‌లో కనిపించలేదంటూ అభిమానులు లైక్‌లు, షేర్‌లు చేస్తున్నారు. అయితే, ఎన్టీఆర్‌తో ఊర్వశి తీసుకున్న సెల్ఫీ ఎడిట్‌ చేసి, ఫిల్టర్స్‌ జోడించి పోస్ట్‌ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘ఏం ఫిల్టర్లు వాడారు’, ‘ఎడిట్‌ చేశారా’ అంటూ కామెంట్లు రావడంతో ‘చైనా ఫోన్‌ ఉపయోగించి ఈ ఫొటో తీసినందుకు సారీ’ అంటూ మరో పోస్ట్‌ పెట్టింది.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికొస్తే, కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘దేవర’. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీతోనే జాన్వీకపూర్‌ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని