Skanda: రామ్‌ పోతినేని గురించి చిరంజీవి నిజమే చెప్పారు: ఊర్వశి రౌతేలా

రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న సినిమా ‘స్కంద’. ఇందులో రామ్‌తో కలిసి డ్యాన్స్‌ చేయడంపై ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మాట్లాడారు.

Updated : 20 Sep 2023 18:27 IST

హైదరాబాద్‌: బోయపాటి శ్రీను-రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’ (Skanda). మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ మూవీలోని స్పెషల్ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ‘కల్ట్ మామా.. ’ అంటూ సాగే ఆ పాటలో రామ్‌తో పాటు బాలీవుడ్‌ హీరోయిన్ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) అదరగొట్టారు. ఈ పాట విడుదల సందర్భంగా రామ్‌ గురించి ఊర్వశి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మిస్సమ్మ’లో ఆ పాత్రపై అక్కినేనిని అడిగితే.. ఏమన్నారంటే!: రాజమౌళి

 ‘‘వాల్తేరు వీరయ్య’ సినిమా సమయంలో రామ్ డ్యాన్స్‌ గురించి చిరంజీవి నాతో చెప్పారు. ‘ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు బెస్ట్‌ డ్యాన్సర్‌తో నువ్వు పనిచేస్తున్నావు. ఒకటి నేను, రెండు రామ్‌ పోతినేని’ అని చిరంజీవి చెప్పారు. ఆయన చెప్పింది నిజం. రామ్‌ అద్భుతమైన డ్యాన్సర్‌. ఎంత కష్టమైన మూమెంట్‌ అయినా సింగిల్ టేక్‌లో చేసేస్తారు’’ అని ఊర్వశి వివరించారు. ఇక ‘అఖండ’తో మంచి విజయాన్ని అందుకున్న బోయపాటి.. పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘స్కంద’ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల నటించారు. తమన్‌ సంగీతమందించారు. శ్రీకాంత్‌, గౌతమి, ప్రిన్స్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని