Valari OTT Release: నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న హారర్‌ మూవీ ‘వళరి’

రితికా సింగ్‌ కీలక పాత్రలో మిత్రికా సంతోషిణి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వళరి’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 12 Feb 2024 20:14 IST

హైదరాబాద్‌: ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ‘వ‌ళ‌రి’లో (Valari OTT Release) రితికా సింగ్‌తో పాటు శ్రీరామ్ ప్ర‌ధాన పాత్ర‌ పోషిస్తున్నారు. కెప్టెన్ న‌వీన్ నాయుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే శ్రీరామ్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రితికా దీనంగా పడుకొని ఉండగా, వెనకవైపు జుట్టు విరబోసుకున్న ఓ బాలిక నిలబడి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్నారు.

మాధ‌వ‌న్ మూవీతో ఎంట్రీ...

మాధ‌వ‌న్ హీరోగా న‌టించిన ఇరుదుసుట్రు సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రితికాసింగ్‌. ఇందులో బాక్స‌ర్ పాత్ర‌లో రితికా అభిన‌యానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. స్వ‌త‌హాగా మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బాక్స‌ర్ కావ‌డంతో ఈ పాత్ర‌కు ప్రాణం పోసింది. ‘ఇరుదుసుట్రు’ను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేశారు. ఇందులో వెంక‌టేష్ హీరోగా న‌టించారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ ‘వేట్టైయాన్‌’లో రితికా సింగ్ ఓ యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. అమితాబ్‌బ‌చ్చ‌న్‌, రానా, ఫ‌హాద్ ఫాజిల్ ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని