valentines night: ఓటీటీలోకి వచ్చేసిన వాలెంటైన్స్‌ నైట్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

valentines night: చైతన్యరావు, సునీల్‌ కీలక పాత్రల్లో నటించిన ‘వాలెంటైన్స్‌ నైట్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Published : 19 Feb 2024 20:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 30 వెడ్స్ 20 వెబ్‌సిరీస్ ద్వారా న‌టుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు చైత‌న్య‌రావు. ఆయన కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్‌’ (Valentines Night). సునీల్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, లావ‌ణ్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. అనిల్ గోపీరెడ్డి దర్శకుడు. ఇప్పటికే థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో (ETV Win) ప్రస్తుతం స్ట్రీమింగ్‌ మొదలైంది.

ఇంతకీ కథేంటంటే: అజ‌య్ (చైత‌న్య‌రావు) ఆర్జేగా ప‌నిచేస్తుంటాడు.  ప్రియ‌(లావ‌ణ్య‌) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. త‌న ఫ్యామిలీ కోసం ప్రియ‌ ప్రేమకు అజ‌య్ బ్రేక‌ప్ చెప్పాల్సివ‌స్తుంది. రాఘ‌వ (శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌) స‌క్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్‌.  త‌న వ్యాపార ప‌నుల్లో ప‌డి భార్య మాయ‌, కూతురు వేద‌ను నిర్ల‌క్ష్యం చేస్తాడు. వేద డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారుతుంది. త‌న ఫ్యామిలీకి ఎదురైన ఓ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మాయ త‌న స్నేహితుడు మాడీ (ర‌వివ‌ర్మ‌) స‌హాయం కోరుతుంది. మ‌రోవైపు సిటీలో డ్ర‌గ్స్ వ్యాపారాన్ని అరిక‌ట్ట‌డానికి నియమించిన స్పెష‌ల్ ఆఫీస‌ర్ కృష్ణ‌మోహ‌న్‌కు (సునీల్‌) డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ అలీ (ముక్కు అవినాష్‌) దొరుకుతాడు. అత‌డి ద్వారా డ్ర‌గ్స్ దందా గురించి కృష్ణ మోహ‌న్ కు తెలిసిన నిజాలు ఏంటి? డ్ర‌గ్స్ దందా న‌డుపుతోన్న అసలు వ్యక్తి ఎవరు? తాను ప్రేమించిన రాహుల్ వ‌ల్ల వేద ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంది అన్నదే కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని