Varalaxmi Sarathkumar: అందుకే ఆ చిత్రాన్ని పక్కన పెట్టా: వరలక్ష్మీ శరత్‌కుమార్‌

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించిన కొత్త చిత్రం ‘శబరి’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

Published : 13 Apr 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar). ఈ ఏడాది ఇప్పటికే ‘హనుమాన్‌’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె త్వరలోనే ‘శబరి’ (Sabari) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ విలేకరి.. ‘మీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘కన్నమూచి’ (Kannamoochi) అప్‌డేట్‌ ఇవ్వండి’ అని ప్రశ్నించగా వరలక్ష్మి స్పందించారు. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం దర్శకురాలిగా ఆ సినిమాని ప్రకటించా. కానీ, నటిగా తెలుగులో వరుస అవకాశాలు రావడంతో ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టా. తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు నా వంతు కృషి చేస్తున్నా. తెలుగు సినిమాకు థ్యాంక్స్‌. ‘కన్నమూచి’ని ప్రారంభించినప్పుడు మీకు తెలియజేస్తా’’ అని అన్నారు. ‘మ్యారేజ్‌ డేట్‌’ గురించి అడగ్గా ఆ విషయం తనకే ఇంకా తెలియదని, తన ఫోకస్‌ అంతా సినిమాలపైనే ఉందని పేర్కొన్నారు. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌తో మార్చి 1న ఆమె నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

‘పోడా పోడి’ (తమిళ్‌)తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కన్నడ, మలయాళంలోనూ నటించారు. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘క్రాక్‌’, ‘నాంది’, ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లు ప్లే చేసి, విశేషంగా అలరించారు. ఆమె ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘శబరి’. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మే 3న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని