Varunlav: మొదలైన వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్‌

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్ అవుతున్నాయి.

Updated : 31 Oct 2023 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల (Varun tej - Lavanya tripathi) పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రేపు(నవంబర్‌ 1న) వీరి వివాహం ఇటలీలో జరగనుంది. ఈ వేడుకలో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీ జరిగింది. ఇందులో లావణ్య త్రిపాఠి వైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే సోషల్‌ మీడియాలో అభిమానులు #VarunLav అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. దీంతో ఇది ట్రెండింగ్‌లో టాప్‌లోకి వచ్చింది.

అందుకే వరుణ్‌ తేజ్‌ పెళ్లికి వెళ్లడంలేదు: రేణూ దేశాయ్‌

ఇక ఈ పార్టీలో రామ్‌ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహాలు కూడా కలర్‌ఫుల్‌గా కనిపించారు. ఇప్పటికే పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. నేడు హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. ఈ పెళ్లికి ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. హీరో నితిన్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన అక్కడకు చేరుకున్నారు. అలాగే ఇటలీ నుంచి వచ్చాక హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. నవంబర్‌ 5న మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా రిసెప్షన్‌ జరగనుంది. ఇక వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు ఈ ప్రేమజంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు