Upcoming Movies: ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?

Upcoming Movies: 2024లో జనవరి మూవీల కోటా పూర్తయింది. వినోదాల విందును పంచడానికి ఫిబ్రవరి సిద్ధమైంది. మరి మొదటి వారంలో అలరించే చిత్రాలేంటో చూసేయండి.

Updated : 31 Jan 2024 17:42 IST

సుహాస్‌.. మ్యారేజ్‌ బ్యాండు

దర్శకుడు వెంకటేశ్‌ మహా సమర్పణలో సుహాస్‌ (Suhas) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని రూపొందించిన ఈ చిత్రాన్ని.. శివానీ (Shivani) జీఏ2 పిక్చర్స్‌, స్వేచ్ఛ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.


సరికొత్త కథాంశంతో..

లక్ష్ చదలవాడ హీరోగా విక్రాంత్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘ధీర’ (Dheera). శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. సరికొత్త కథాంశంతో మాస్‌, యాక్షన్‌, ఎమోషన్‌ అంశాలను మేళవించి ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.  ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


హీరోకి శాపం ఉంటే!

యష్‌ పూరి, అపూర్వ రావ్‌ జంటగా కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. ‘‘నాకు ఇతిహాసాలంటే ఇష్టం. మహాభారతం చదువుతున్నప్పుడు దాంట్లో అనేక శాపాల గురించి ఉంటుంది. అలా ఒక శాపం హీరోకి ఉంటే ఎలా ఉంటుందనే పాయింట్‌తో మోడ్రన్‌గా ఈ చిత్రం తెరకెక్కించాం. నిజాయతీతో కూడిన ప్రయత్నం’’ అని డైరెక్టర్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానుంది.


మాట విలువ తెలిపే బూట్‌కట్‌ బాలరాజు

‘బూట్‌కట్‌ బాలరాజు’గా (Bootcut balraj) వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు సయ్యద్‌ సోహెల్‌. ఈ చిత్రాన్ని శ్రీకోనేటి తెరకెక్కించారు. ఎండీ పాషా నిర్మాత. మేఘ లేఖ కథానాయిక. సునీల్‌, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంటెంట్‌ ఉన్న ప్రతి సినిమా హిట్‌ అవుతుందని, ఈ చిత్రం వినోదాన్ని పంచడంతో పాటు, మాటకు ఉన్న విలువ, గౌరవం గురించి చెబుతుందని సోహెల్‌ అంటున్నారు.


‘గేమ్‌ ఆన్‌’ కాబోతోంది

తానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం ‘గేమ్ ఆన్‌’ (Game On). దయానంద్‌ దర్శకత్వం వహించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న విడుదల కానుంది. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి, రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌ను ఎంచుకోవడానికి కారణం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


‘‘ప్రేక్షకులందర్నీ కడుపుబ్బా నవ్వించే చిత్రం మా ‘కిస్మత్‌’’ (Kismat) అంటున్నారు దర్శకుడు శ్రీనాథ్‌ బాదినేని. ఆయన తెరకెక్కించిన ఈ సినిమాలో నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వదేవ్‌, అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.



ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!

అమెజాన్ ప్రైమ్​

  • డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 2
  • మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లిష్‌ సిరీస్) - ఫిబ్రవరి 2

డిస్నీ+హాట్‌స్టార్‌

  • కోయిర్ (ఇంగ్లిష్‌ సిరీస్) - జనవరి 31
  • మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 2

  • సెల్ఫ్ (ఇంగ్లిష్‌ సినిమా) - ఫిబ్రవరి 2

నెట్‌ఫ్లిక్స్​

  • మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లిష్‌ సిరీస్) - స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లిష్‌ సినిమా) - స్ట్రీమింగ్‌ అవుతోంది
  • జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లిష్‌ చిత్రం) - జనవరి 30
  • నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లిష్‌ సిరీస్) - జనవరి 30
  • జాక్‌ వైట్‌ హాట్‌ -సెటెల్‌ డౌన్‌ (ఇంగ్లిష్‌) జనవరి 30
  • అలెగ్జాండర్ : ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లిష్‌ సిరీస్) - జనవరి 31
  • బేబీ బండిటో (ఇంగ్లిష్‌ సిరీస్) - జనవరి 31
  • ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) - జనవరి 31
  • ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లిష్‌ మూవీ) - ఫిబ్రవరి 1
  • లెట్స్ టాక్ అబౌట్ (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 2
  • ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లిష్‌ సినిమా) - ఫిబ్రవరి 2

మనోరమ మ్యాక్స్​

  • ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 2

బుక్ మై షో

  • అసెడియో (స్పానిష్ సినిమా) - జనవరి 30

జియో సినిమా

  • ఇన్ ద నో (ఇంగ్లిష్‌ సిరీస్) - (స్ట్రీమింగ్ అవుతోంది)

జీ5

  • ది సిగ్నేచర్‌ (హిందీ) ఫిబ్రవరి 2

లయన్స్‌ గేట్‌ ప్లే

  • వన్‌ రేంజర్‌ (ఇంగ్లిష్‌/హిందీ) ఫిబ్రవరి 2
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని