Vicky Kaushal: అల్లు అర్జున్‌కు విక్కీ కౌశల్ ప్రశంస.. ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రశంసించారు. ఏ విషయంలో అంటే?
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలపై (69th National Film Awards 2023) బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) తాజాగా స్పందించారు. అవార్డుల విషయంలో జ్యూరీ నిర్ణయం ఎప్పుడూ గొప్పగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికైన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను ఆయన ప్రశంసించారు. ఆ చిత్రంలో (Pushpa The Rise)లో అర్జున్ అద్భుతంగా నటించారని కొనియాడారు. జాతీయ మీడియాతో విక్కీ కౌశల్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. నేషనల్ అవార్డ్స్‌పై స్పందించారు.
ఆ సమయంలో ప్రభాస్ ఓదార్పునిచ్చాడు: జగపతిబాబు
తాను నటించిన ‘సర్దార్ ఉద్దమ్’ (Sardar Udham) గురించి ప్రశ్న ఎదురవగా.. దర్శకుడు సూజిత్ సిర్కార్‌తో కలిసి పనిచేయడమే ఏదో సాధించినట్లు ఫీలయ్యానని, అలాంటిది ఆ సినిమాకి పలు విభాగాల్లో జాతీయ అవార్డులురావడం బోనస్ అని పేర్కొన్నారు. ఆ సినిమా ఎన్నో విషయాల్లో వ్యక్తిగతంగా తనకు చాలా ప్రత్యేకమన్నారు. హిట్, ఫ్లాప్.. ఇలా సినిమాల ఫలితం ఏదైనా తాను స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఉత్తమ చిత్రంసహా ఐదు విభాగాల్లో ‘సర్దార్ ఉద్దమ్’ జాతీయ పురస్కారం దక్కించుకుంది. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (2019) సినిమాలోని నటనకుగాను విక్కీని జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే.
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ఇదే సినిమాకిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ నిలిచారు. ‘పుష్ప: ది రైజ్’ సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్‌లుక్, గ్లింప్స్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Laddu Auction: గచ్చిబౌలిలో రూ.25.5 లక్షలు పలికిన గణపయ్య లడ్డూ
-
Muttiah Muralitharan: నాని సినిమాలు ఎక్కువగా చూశా: ముత్తయ్య మురళీధరన్
-
Sony earbuds: సోనీ నుంచి ఫ్లాగ్షిప్ ఇయర్‌బడ్స్.. 5జీ స్మార్ట్‌ఫోన్ కంటే ఎక్కువే!
-
Siddaramaiah: అప్పులు తెచ్చుకొని.. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవద్దు: కర్ణాటక సీఎం
-
Hyderabad: గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!
-
PM Modi: నాకు సొంతిల్లు లేదు.. కానీ: ప్రధాని మోదీ