Vidudhala: ఓటీటీలోకి ‘విడుదల 1’ తెలుగు వెర్షన్ వచ్చేసింది..
కోలీవుడ్ రీసెంట్ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘విడుదలై పార్ట్1’ (Viduthalai Part 1) ఇకపై తెలుగువారికి అందుబాటులో ఉండనుంది.
హైదరాబాద్: సూరి (Soori), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ తెరకెక్కించిన కోలీవుడ్ సినిమా ‘విడుదలై పార్ట్ 1’ (Viduthalai Part 1). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘విడుదల పార్ట్ 1’గా విడుదల చేశారు. ఇక, ఇప్పటికే ఓటీటీ వేదికగా సినీ ప్రియులకు చేరువలో ఉన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు జీ5 ఓటీటీ వేదికగా ఇకపై ‘విడుదల పార్ట్ 1’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తెలుగువారికి వినోదాన్ని అందించనుంది.
సినిమా స్టోరీ ఏంటంటే..?
కుమరేశన్ (సూరి) ఓ పోలీస్ కానిస్టేబుల్. ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు పనిచేస్తున్న ప్రత్యేక పోలీస్ దళంలో డ్రైవర్‌గా చేరతాడు. ప్రజలకి కష్టం వస్తే ఆదుకోవడమే పోలీస్ విధి అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. అనుకోకుండా అడవిలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఆమెని ఆస్పత్రిలో చేర్పించేందుకని పోలీస్ జీప్‌ని వాడతాడు. దాంతో పైఅధికారుల ఆగ్రహానికి గురవుతాడు.(Viduthala telugu review) క్షమాపణ చెప్పాల్సిందే అంటాడు అధికారి. కుమరేశన్ మాత్రం తప్పు చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పనంటాడు. మరోవైపు గాయపడిన ఆ మహిళ మనవరాలు పాప (భవానీ శ్రీ)తో కుమరేశన్ స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమకి దారితీస్తుంది. ఒక పక్క ప్రేమ, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి సంఘర్షణకి గురవుతాడన్న ఆసక్తికర కథాంశంతో ‘విడుదలై పార్ట్1’ రూపుదిద్దుకుంది. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. సూరి, విజయ్ సేతుపతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ చిత్రాన్ని ‘విడుదల పార్ట్1’ పేరుతో తెలుగులో విడుదల చేసినప్పటికీ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers' protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ