Viduthalai Part1: ఓటీటీలో ‘విడుదలై పార్ట్‌-1’.. సర్‌ప్రైజ్‌ ఏంటో తెలుసా?

viduthalai part 1 ott release date: సూరి, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విడుదలై:పార్ట్‌-1’ ఓటీటీలో విడుదల కానుంది.

Published : 27 Apr 2023 19:06 IST

హైదరాబాద్‌: తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించిన పీరియాడిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘విడుదలై: పార్ట్‌-1’ (Viduthalai Part1). సూరి, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు. మార్చి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో తమిళ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఇక్కడే ఈ మూవీ అభిమానులకు ఒక సర్‌ ప్రైజింగ్‌ ట్విస్ట్‌ కూడా ఉంది. ఓటీటీలో డైరెక్టర్స్‌ కట్‌ ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు. అంటే, థియేటర్‌లో చూడని అదనపు సన్నివేశాలు ఇందులో చూడొచ్చు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 ట్వీట్‌ చేసింది. ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుంది (viduthalai part 1 ott release date). తెలుగు వెర్షన్‌ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి.

ఇంతకీ కథంటంటే: కుమ‌రేశ‌న్ (సూరి)  కొత్త‌గా ఉద్యోగంలో చేరిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌.  ప్ర‌జాద‌ళం నాయ‌కుడైన పెరుమాళ్‌(విజ‌య్ సేతుప‌తి)ని ప‌ట్టుకునేందుకు ప‌నిచేస్తున్న ప్ర‌త్యేక‌ పోలీస్ ద‌ళంలో డ్రైవ‌ర్‌గా చేర‌తాడు. ద‌ట్ట‌మైన అడ‌విలో ప‌నిచేస్తున్న పోలీస్ ద‌ళానికి రోజూ జీప్‌లో ఆహారం సర‌ఫ‌రా చేయ‌డమే కుమరేశ‌న్ ప‌ని. ప్ర‌జ‌ల‌కి క‌ష్టం వ‌స్తే ఆదుకోవ‌డ‌మే పోలీస్ విధి అనేది ఆయ‌న న‌మ్మిన సిద్ధాంతం. అనుకోకుండా అడ‌విలో ఓ మ‌హిళ‌పై ఎలుగుబంటి దాడి చేయ‌డంతో ఆమెని ఆస్ప‌త్రిలో చేర్పించేందుక‌ని పోలీస్ జీప్‌ని వాడ‌తాడు. దాంతో పై అధికారుల ఆగ్ర‌హానికి గుర‌వుతాడు. క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అంటాడు అధికారి. కుమ‌రేశ‌న్ మాత్రం త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టి క్ష‌మాప‌ణ చెప్ప‌నంటాడు. మ‌రోవైపు  గాయ‌ప‌డిన ఆ మ‌హిళ మ‌న‌వరాలు పాప (భ‌వానీ శ్రీ)తో కుమ‌రేశ‌న్ స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమ‌కి దారితీస్తుంది. ఒక ప‌క్క ప్రేమ‌, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేట‌లో ఎలాంటి కుమ‌రేశ‌న్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి గుర‌వుతాడ‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

‘విడుదల పార్ట్‌-1’ తెలుగు రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు