Vidya Balan: ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్‌

నటి విద్యా బాలన్‌ తన కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. 

Published : 25 Apr 2024 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్టార్‌గా ఎదిగారు నటి విద్యా బాలన్‌ (Vidya Balan). తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఓ అవార్డు వేడుకలో తనను అవమానించినట్లు చెప్పారు.

‘‘2008లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు ప్రదానోత్సవంలో ‘హేయ్ బేబీ’లో కాస్ట్యూమ్స్‌కు గాను నాకు నా-రియల్‌ అవార్డు (అసలు ప్రేక్షకాదరణ పొందనివాటికి ఇచ్చే అవార్డు) ఇచ్చారు. దాన్ని ప్రకటించినప్పుడు నా దుస్తులు నేను ఎంపిక చేసుకున్నవి కాదు.. అవి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ తయారుచేసినవి అని చెప్పాను. అయినా వాళ్లు వినలేదు. ఆ సమయంలో నేను ధైర్యంగా మాట్లాడలేకపోయేదాన్ని. అందుకే వారు నన్ను అవమానించి ఆ అవార్డు ఇచ్చినా మౌనంగా తీసుకున్నా. నా కాస్ట్యూమ్‌ డిజైనర్‌, దర్శకుడితో కలిసి దాన్ని అందుకుంటాను అని చెప్పినా వాళ్లు అంగీకరించలేదు. నేనే తీసుకోవాలని పట్టుబట్టారు. షారుక్‌ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌ నాకు దాన్ని అందించారు. ఆరోజు రాత్రంతా నేను నిద్రపోలేదు. ఒంటరిగా ఫీలయ్యాను. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వస్తే ఇలాంటి అవమానాలు తప్పవని గ్రహించాను. మన వెనక ఎవరూ లేరు అనుకున్నప్పుడు బహిరంగంగానే మనపై జోక్స్‌ వేసి ఎగతాళి చేస్తారని తెలుసుకున్నా. ఆరోజు చాలా బాధపడ్డాను’ అని చెప్పారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె తన చీరల గురించి మాట్లాడుతూ.. ‘సినీతారలకు చీరలు ఎక్కువ ఉంటాయని భావిస్తారు. కానీ, నా దగ్గర అందరూ అనుకునేన్ని చీరలు లేవు. కేవలం 25 ఉన్నాయంతే. నేను కట్టుకునే చీరలన్నీ అద్దెకు తీసుకునేవే. నేనే కాదు చాలామంది అలానే చేస్తారు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని