Vidya Balan: ‘యానిమల్‌’ అందుకే హిట్‌ అయింది: విద్యా బాలన్‌

‘యానిమల్‌’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్‌ హిట్‌ అయిందని విద్యా బాలన్‌ అన్నారు. 

Published : 18 Apr 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)- బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దీని రిలీజ్‌ సమయంలో తీవ్ర విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. తాజగా దీనిపై నటి విద్యాబాలన్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘కంటెంట్‌ ఈజ్‌ కింగ్ అని అంటుంటారు.. కానీ, దానికంటే నమ్మకం ముఖ్యం. ఇటీవల వచ్చిన ‘యానిమల్’ దాన్ని నిరూపించింది. ఆ చిత్రబృందాన్ని అభినందించాలి. అందులో కంటెంట్‌ లేదనేది నా ఉద్దేశం కాదు. ఎన్ని విమర్శలు ఎదురైనా వాళ్లు ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు. మూవీ హిట్‌ అవుతుందని నమ్మారు. చెప్పాలనుకున్న కథను సూటిగా చెప్పారు. అందుకే అంత పెద్ద హిట్‌గా నిలిచింది. సినిమాపై ఎన్ని నెగెటివ్ కామెంట్స్‌ వచ్చినా.. అవేవీ ప్రభావం చూపించలేకపోయాయి. ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ఇది విజయం సాధించింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది’ అని అన్నారు.

ఇదే ఇంటర్వ్యూలో విద్యా మాట్లాడుతూ.. షారుక్‌తో కలిసి పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించాలని ఉందని తెలిపారు. ‘ఓం శాంతి ఓం’లో ఆయనతో కలిసి నటించినప్పటికీ అది చాలా చిన్న పాత్ర అని అన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన  ‘ప్యార్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు కార్తీక్ ఆర్యన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘భూల్‌ భులయ్యా 3’ (Bhool Bhulaiyaa 3)లో కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఇది రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని