Vijay Deverakonda: ఆ సినిమా ఫెయిల్యూర్‌.. నాకు నేనే ఆ శిక్ష విధించుకున్నా: విజయ్‌ దేవరకొండ

‘లైగర్‌’ ఫెయిల్యూర్‌ తర్వాత తనకు తానే శిక్ష వేసుకున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ ప్రమోషన్‌లో ఆయన మాట్లాడారు.

Published : 02 Apr 2024 10:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)తో అలరించడానికి సిద్ధమయ్యారు హీరో విజయ్ దేవరకొండ. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ జోరు పెంచారు విజయ్‌. తాజాగా ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తాను నటించిన ‘లైగర్‌’ ఫెయిల్యూర్‌పై స్పందించారు.

పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అప్పట్లో విజయ్‌ మాటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘లైగర్‌’కు ముందు.. తర్వాత నా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే ఒక విషయంలో జాగ్రత్త పడుతున్నా. సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకొన్నా. నాటి నుంచి అదే అమలు చేస్తున్నా. ఇది నాకు నేనే విధించుకున్న శిక్ష’ అని అన్నారు.

ఇక ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి మాట్లాడుతూ.. ‘మనకు ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పే వ్యక్తి ప్రతి కుటుంబలో ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్‌. మా కుటుంబంలో అది మా నాన్న. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే నాకు మా నాన్నే గుర్తొచ్చారు. అందుకే నా పాత్రకు కూడా ఆయన పేరే పెట్టాం. ఎందుకంటే ఆ పేరు పెట్టుకుంటేనే ఎమోషన్స్‌ పలికించడం సులువు అవుతుంది’ అని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుందని హామీ ఇచ్చారు విజయ్‌ దేవరకొండ.

‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ - పరశురామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌, పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని