Vijay Deverakonda: మా గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇలానే ఆటపట్టించే వాళ్లం: విజయ్‌ దేవరకొండ

తన తమ్ముడి గొంతు కూడా తన వాయిస్‌లానే ఉంటుందని విజయ్‌ దేవరకొండ అన్నారు. తామిద్దరం కలిసి ప్రాంక్‌లు చేసేవాళ్లని చెప్పారు.

Updated : 23 May 2024 11:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ఇద్దరూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. తాజాగా విజయ్‌ మూడు సినిమాలు ప్రకటించగా.. ఆనంద్‌ (Anand Devarakonda) ‘గం.. గం.. గణేశా’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆనంద్‌ ప్రెస్‌మీట్‌లో విజయ్‌ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించే వారో చెప్పి నవ్వులు పూయించారు.

‘మా ఇద్దరి వాయిస్‌ ఒకేలా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మకు కూడా మాలో ఎవరు పిలిచారో అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత మా ఫ్రెండ్స్‌ను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆటపట్టించేవాళ్లం. నా మిత్రులు ఫోన్‌ చేస్తే ఆనంద్‌ మాట్లాడేవాడు. వాళ్లు నేను మాట్లాడుతున్నా అనుకొనే వారు. కాలేజ్‌ డేస్‌లో ఇలా ఎక్కువగా ప్రాంక్‌ చేసేవాళ్లం. నా సినిమాలో ఆనంద్‌తో డబ్బింగ్‌ చెప్పించాలని ప్రయత్నించాను’ అన్నారు. ‘గం.. గం.. గణేశా’ గురించి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా బాగుందని అభినందించారు. ప్రీ రిలీజ్‌కు రావాలనుందని.. కానీ, వైజాగ్‌లో షూటింగ్‌ కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు.

నా గురించి అలా రాయడం చూసి బాధేసింది: లయ

‘గం.. గం.. గణేశా’ (Gam Gam Ganesha movie) కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ‘బేబి’ లాంటి సూపర్ హిట్‌ తర్వాత ఆనంద్‌ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఇది ఓ విగ్రహం చోరీ చుట్టూ తిరిగే కథ. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీ వాస్తవ కథానాయికగా కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని