Vijay: ఆఖరి చిత్రం.. హెచ్‌ వినోద్‌తో

తమిళ అగ్రహీరో విజయ్‌, దర్శకుడు వెంకట్‌ప్రభు కలయికలో ‘గోట్‌’ చిత్రం శరవేగంగా ముస్తాబవుతోంది. ఇదయ్యాక ఆయన పూర్తిస్థాయిలో తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని ఈమధ్యే వార్తలు వెలువడ్డాయి.

Updated : 03 Apr 2024 14:07 IST

మిళ అగ్రహీరో విజయ్‌, దర్శకుడు వెంకట్‌ప్రభు కలయికలో ‘గోట్‌’ చిత్రం శరవేగంగా ముస్తాబవుతోంది. ఇదయ్యాక ఆయన పూర్తిస్థాయిలో తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని ఈమధ్యే వార్తలు వెలువడ్డాయి. అయితే విజయ్‌ మనసు మార్చుకొని, హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో చివరిగా తన 69వ చిత్రం చేయనున్నారనే కొత్త కబురు తాజాగా వినిపిస్తోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ‘విజయ్‌ 69వ చిత్రం కోసం దర్శకులు కార్తీక్‌ సుబ్బరాజ్‌, ఆర్జే బాలాజీ, హెచ్‌ వినోద్‌లు సంప్రదించారు. హెచ్‌ వినోద్‌ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారు’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ‘రాజకీయాలంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు.. త్యాగం. నా సీనియర్ల బాటలో నడుస్తూ అందులోని లోతుపాతులు తెలుసుకుంటున్నాను. ఎప్పట్నోంచో దీనికోసం మానసికంగా సిద్ధమవుతున్నాను. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారడానికి ముందు మరో చిత్రంలో నటించాలనుకుంటున్నాను’ అంటూ విజయ్‌ ఒక ప్రకటన విడుదల చేయడంతో ఈ కొత్త సినిమా వార్తలకు బలం చేకూరినట్టైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని