Vijay Sethupathi: ఒక్క రూపాయి ఇవ్వకపోయినా.. ఆయనతో కలిసి నటించేవాణ్ని: విజయ్‌ సేతుపతి

‘జవాన్‌’ సినిమాలో తానెందుకు నటిస్తున్నారో నటుడు విజయ్‌ సేతుపతి తెలిపారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

Updated : 16 Jul 2023 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోగానే కాకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించే నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). ‘ముంబైకర్‌’ (Mumbaikar) సినిమాతో ఆయన బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ప్రస్తుతం అక్కడ ‘జవాన్‌’ (Jawan)లో విలన్‌గా నటిస్తున్నారు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తానెందుకు ఈ సినిమాలో నటిస్తున్నారో విజయ్‌ సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

షారుక్‌ ఖాన్‌ కోసమే ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాణ్ని అంటూ షారుక్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 2019లో వచ్చిన ‘సూపర్‌ డీలక్స్‌’ (Super Deluxe) సినిమాలోని సేతుపతి నటనపై షారుక్‌ నాడు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని సినీ ప్రియులు ఆకాంక్షించారు. ‘జవాన్‌’తో వారి కోరిక నెరవేరినట్టైంది.

మరోసారి కాజోల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. షారుఖ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం

ఇటీవల విడుదలైన ప్రివ్యూ వీడియో ‘జవాన్‌’పై అంచనాలు పెంచింది. షారుక్‌ గుండుసహా పలు విభిన్న లుక్స్‌లో కనిపించి, ఆకట్టుకున్నారు. ఆయన ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న తప్పులను సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తి ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone) అతిథిగా మెరవనున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. పలు డబ్బింగ్‌ చిత్రాలతో అలరించిన సేతుపతి ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఉప్పెన’వంటి స్ట్రైట్‌ తెలుగు మూవీస్‌లో వైవిధ్యం చూపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని