Vijay Sethupathi: కృతి శెట్టితో రొమాంటిక్ సీన్స్ చేయలేను.. ఎందుకంటే: విజయ్ సేతుపతి

కృతిశెట్టితో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించలేనన్నారు విజయ్‌సేతుపతి. దానికి గల కారణాన్ని వివరించారు.

Updated : 06 Jun 2024 10:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో (Maharaja Movie) అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ కృతిశెట్టి (Krithi Shetty) గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో సినిమాలను తిరస్కరించడానికి గల కారణాన్ని వివరించారు.

‘‘నేను నటించిన ‘డీఎస్పీ’ సినిమాలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయలేనని చెప్పా. దానికి కారణం ‘ఉప్పెన’లో ఆమెకు తండ్రిగా నటించాను. అది మంచి విజయాన్ని సాధించింది. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేను. అందుకే వద్దు అని చిత్రబృందంకు చెప్పాను. ‘ఉప్పెన’లో కొన్ని క్లైమాక్స్‌ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి కంగారు పడింది. ‘నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. నన్ను నీ తండ్రిగా భావించు’ అని ధైర్యం చెప్పాను. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు’’ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వివరించారు. గతంలోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయగా.. ఆయన తిరస్కరించారు.

స్మైల్‌కు మీనాక్షి రెడీ.. శారీలో శ్రీలీల.. మానుషి అలా!

‘మహారాజ’ (Maharaja) విషయానికొస్తే.. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. నిథిలన్‌ దర్శకత్వం వహిస్తుండగా అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి, మమత.. కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్‌ 14న విడుదల కానుంది. ఇటీవల దీని ట్రైలర్‌ను విడుదల చేయగా దానికి మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని