Vijay Sethupathi: అలాంటి సినిమాలు చేస్తే గుర్తింపు రాదు: విజయ్‌ సేతుపతి

మల్టీ స్టారర్‌ సినిమాల్లో నటించడం వల్ల గుర్తింపు రాదని విజయ్‌ సేతుపతి అభిప్రాయపడ్డారు.

Updated : 07 Jun 2024 12:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విజయ్‌ సేతుపతి. తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్టీస్టారర్‌ చిత్రాల గురించి మాట్లాడారు. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

కోలీవుడ్‌లో స్టార్‌ హీరోల సినిమాలో నటించాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు విజయ్‌ (Vijay Sethupathi) ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘‘నేను అలాంటి మల్టీ స్టారర్‌లు చేసి విసిగిపోయాను. వాటి వల్ల నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మరో అగ్ర హీరోతో కలిసి స్క్రీన్‌ పంచుకోవాల్సినప్పుడు మన పాత్ర ఎలాంటిదనే విషయం ముందే చెబుతారు. దానిలో మనం ఎంత బాగా నటించినా పేరు మాత్రం రాదు. ఆ స్టార్‌ హీరోతో సమానంగా శ్రమించినా ఎవరూ గుర్తించరు’’ అని చెప్పారు.

మోదీతో అకీరా.. ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన రేణూదేశాయ్‌

విలన్‌ పాత్రల్లో కూడా నటించకూడదని నిర్ణయించుకున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ‘విలన్‌, అతిథి పాత్రల్లోనూ నటించకూడదనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో ఇలాంటి అవకాశాలు చాలా వచ్చాయి. వాటిని తిరస్కరించాను. నాకు రొమాంటిక్ సినిమాలు చేయడమంటే ఇష్టం. మంచి లవ్‌ స్టోరీ కోసం వెతుకుతున్నా. అటువంటి కథతో త్వరలోనే మీ ముందుకు వస్తా’ అని చెప్పారు. అలాగే దర్శకత్వంపై తనకు ఆసక్తి ఉన్నట్లు విజయ్‌ సేతుపతి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన నటించిన 50వ సినిమా ‘మహారాజ’ (Maharaja) విడుదలకు సిద్ధమైంది. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న దీనికి నిథిలన్‌ దర్శకత్వం వహిస్తుండగా అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి, మమత.. కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 14న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని