Vijay Varma: పెళ్లెప్పుడో చెప్పలేను: విజయ్ వర్మ

నటుడు విజయ్‌వర్మ (Vijay Varma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన పెళ్లి గురించి మాట్లాడారు.

Updated : 26 Nov 2023 14:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma), నటి తమన్నా (Tamannaah) ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ వర్మ తన పెళ్లి వార్తలపై స్పందించారు. అందరూ తనని ఇదే ప్రశ్న అడుగుతున్నారన్నారు.

‘‘నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి సిద్ధంగా లేదు’’ అని తొలుత ఆయన సరదాగా బదులిచ్చారు. ‘‘నా పెళ్లి గురించి మా ఇంట్లోవాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మా అమ్మ తరచూ పెళ్లి గురించే ప్రశ్నిస్తుంటారు. ఆమెకే నేను ఇప్పటివరకూ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయా. అలాగే, మీకు కూడా నేను సమాధానం చెప్పలేను’’ అని ఆయన అన్నారు.

Vanitha: వనితా విజయ్‌కుమార్‌పై దాడి.. నటి పోస్టు వైరల్‌

ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘మాన్‌సూన్‌ షూటౌట్‌’ రిలీజ్‌ కోసం ఎదురుచూసిన రోజుల్లోనే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానన్నారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తమ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కడం చూసి జీవితం మారుతుందని ఆశించానని.. కాకపోతే అలా జరగలేదని చెప్పారు. ప్రస్తుతం తనకు మంచి పాత్రల్లో నటించే అవకాశం వస్తోందన్నారు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ కోసం తొలిసారి విజయ్‌ - తమన్నా కలిసి వర్క్‌ చేశారు. ఆ సెట్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం కుదరింది. అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని