Vikram: ‘తంగలాన్‌’ అంటే అర్థమదే.. అందుకే బరువు తగ్గా: విక్రమ్‌

విక్రమ్‌ తాజా చిత్రం ‘తంగలాన్‌’. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయనతోపాటు దర్శకుడు పా. రంజిత్‌, నిర్మాత జ్ఞానవేల్‌ పాల్గొన్నారు.

Published : 02 Nov 2023 02:09 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు విక్రమ్‌ (Vikram) హీరోగా దర్శకుడు పా. రంజిత్‌ తెరకెక్కించిన చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం ఉదయం చెన్నైలో, సాయంత్రం హైదరాబాద్‌లో టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. హైదరాబాద్‌లో ఏర్పాటైన ఈవెంట్‌కు విక్రమ్‌, దర్శకుడు రంజిత్‌, నిర్మాత జ్ఞానవేల్‌ రాజా తదితరులు హాజరయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ వివరాలివీ..

‘తంగలాన్‌’.. భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరుస్తుంది: విక్రమ్‌

* రిపబ్లిక్‌ డే రోజున సినిమాని విడుదల చేస్తున్నారు. సినిమాలో ఆ నేపథ్యం ఉంటుందా?

నిర్మాత: లేదండీ.. రిపబ్లిక్‌ డేకు, సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇతర చిత్రాలతో పోటీపడకుండా విడిగా వద్దామనుకుంటున్నామంతే. అందుకే సంక్రాంతికి కాకుండా రిపబ్లిక్‌ డే నాడు రిలీజ్‌ చేస్తున్నాం.

* మీ అబ్బాయితోపాటు ఇతర యంగ్‌ హీరోలతో పోటీ పడేందుకే బరువు తగ్గారా?

విక్రమ్‌: అలాంటిదేం లేదు. పాత్ర డిమాండ్‌ మేరకు బరువు తగ్గా.

* తెలుగు దర్శకులతో మళ్లీ సినిమాలు చేస్తారా? ఎవరి దర్శకత్వంలో నటించాలనుకుంటున్నారు?

విక్రమ్‌: తెలుగు దర్శకులందరూ నాకు ఇష్టమే. ముందుగా రాజమౌళి. మంచి కథ ఏ డైరెక్టర్‌ చెప్పినా వారితో చేస్తా.

* ‘తంగలాన్‌’ అంటే అర్థం ఏంటి?

విక్రమ్‌: అదొక తెగ పేరు.

* ఇలాంటి కథలనే మీరు తెరకెక్కిస్తున్నారు?

దర్శకుడు: ఇప్పటి వరకు ఎవరూ చర్చించని కథలను నేను తెరపైకి తీసుకురావాలనుకుంటా.

* కోలీవుడ్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూసినంతగా టాలీవుడ్‌ చిత్రాలను తమిళ ఆడియన్స్‌ చూడట్లేదన్న దానిపై మీరేమంటారు?

విక్రమ్‌: తెలుగు సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, కన్నడ చిత్రాలు ‘కేజీయఫ్‌’, ‘కాంతార’ తమిళంలోనూ ఘన విజయం అందుకున్నాయి. మా సినిమాలకంటే ఇతర పరిశ్రమ చిత్రాలే అత్యధిక వసూళ్లు సాధించాయి. 

నిర్మాత: కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం ‘బాహుబలి 2’. కంటెంట్‌ బాగుంటే తమిళ ఆడియన్స్‌ ఏ చిత్రాన్నైనా ఆదరిస్తారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని