vishwak sen: అర్జున్ వ్యాఖ్యలు.. విశ్వక్‌సేన్ స్పందనేంటో తెలుసా?
నిబద్ధత లేని నటుడు అంటూ అర్జున్ వ్యాఖ్యలపై విశ్వక్‌సేన్ ఏమని స్పందించారో తెలుసా?
హైదరాబాద్: విశ్వక్‌సేన్ (vishwak sen) వ్యవహారశైలి అన్‌ప్రొఫెషనలిజమంటూ సీనియర్ నటుడు అర్జున్ (Arjun) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. విశ్వక్‌కు నిబద్ధత లేదంటూ అర్జున్ కాస్త గట్టిగానే మాట్లాడారు. తనలా మరో నిర్మాతకు జరగకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో కథానాయకుడు విశ్వక్‌సేన్ సిబ్బంది స్పందించారు. సంభాషణలు, పాటలు, మ్యూజిక్ విషయంలో విశ్వక్ సూచనలు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. ఆసక్తికరంగా అనిపించిన చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ అస్సలు అంగీకరించడం లేదని, తాను చెప్పినట్లే నడుచుకోవాలని అంటున్నారని వారు తెలిపారు. విశ్వక్ మాటకు సెట్‌లో అస్సలు గౌరవం ఉండదని చెప్పారు. అందుకే విశ్వక్ మనసుకు నచ్చని పని చేయలేక, సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. తాజా సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్, అగ్రిమెంట్ పత్రాలను విశ్వక్ నిర్మాతల మండలికి పంపినట్లు తెలిపారు. అయితే, ఈ పూర్తి వ్యవహారంపై విశ్వక్‌సేన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. తన సామాజిక మాధ్యమాల్లోనూ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. విశ్వక్ కూడా తన అభిప్రాయాలను మీడియా ముందుకు వచ్చి చెబుతారా? లేదా? అనేది తెలియాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/06/2023)
-
India News
Nitin Gadkari: 2024 నాటికి 50% రోడ్డు ప్రమాదాల తగ్గింపు.. లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే: గడ్కరీ
-
Movies News
Siddu Jonnalagadda: ‘ఇంటింటి రామాయణం’.. ఆ జాబితాలోకి చేరుతుంది: సిద్ధు జొన్నలగడ్డ
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
-
Movies News
NTR: ఎన్టీఆర్‌కు జోడీగా ప్రియాంకా చోప్రా..? ఆసక్తికరంగా ప్రాజెక్ట్ వివరాలు
-
India News
Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!