Prabhas: ప్రతీది మార్పు కోసమే!

కొత్త ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నారు భైరవ, ఆయన బుజ్జి. మరి ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ భైరవ, బుజ్జిల కథేమిటో తెలియాలంటే ఈ నెల 27న విడుదలవుతున్న ‘కల్కి 2898 ఎ.డి’ చూడాల్సిందే.

Updated : 06 Jun 2024 01:09 IST

కొత్త ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నారు భైరవ, ఆయన బుజ్జి. మరి ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ భైరవ, బుజ్జిల కథేమిటో తెలియాలంటే ఈ నెల 27న విడుదలవుతున్న ‘కల్కి 2898 ఎ.డి’ చూడాల్సిందే. ప్రభాస్‌ కథానాయకుడిగా... నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దీపికా పదుకొణె, దిశా పటానీ కథానాయికలు. అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 10న విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ‘ప్రతిదీ మార్పు గురించే...’ అంటూ రాసిఉన్న పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్‌ సందడి చేయనున్నారు. బుజ్జి కార్‌ కూడా ఈ కథలో కీలకం. ‘‘ఒక అద్భుతమైన కథాంశంతో రూపొందిన సినిమా ఇది. విజువల్‌ వండర్‌గా ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ చర్చని లేవనెత్తిన ఈ సినిమాని ఘనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు