Elections: 81 ఏళ్ల బామ్మ.. 41 సార్లు ఓటేసి..!

ఓటు వేసేందుకు వయసు అడ్డే కాదని, ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటారు ఎందరో వృద్ధులు. ఆ కోవకే చెందిన చిన్నమ్మ, తిజియా స్టోరీ చూద్దామా..!

Published : 10 Apr 2024 15:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓటు.. దేశ భవిష్యత్తును నిర్ణయించే అస్త్రం..! నేతల తలరాతలు మార్చే ఆయుధం..! ఈ మాటను గట్టిగానే ఒంటబట్టించుకున్నారు కర్ణాటకకు చెందిన చిన్నమ్మ. ఏ వంకలు చెప్పకుండా ఎక్కడ ఓటింగ్ జరిగినా ముందుండి తన హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకే 81 ఏళ్ల వయసున్న ఆమె ఇప్పటివరకు 41 సార్లు ఓటేశారు. జాతీయమీడియా కథనం ప్రకారం..

చిన్నమ్మ స్వస్థలం.. చామరాజనగర్ జిల్లాలోని చిక్కాటి గ్రామం. ఇప్పటివరకు ఆమె 41 సార్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికల్లో తన హక్కును వినియోగించుకొని ఆ సంఖ్యను పెంచుకోవాలని ఎదురు చూస్తున్నారు. గ్రామ, జిల్లా పంచాయతీ, విధాన సభ, లోక్‌సభ ఎన్నికలు ప్రతీదాంట్లో తప్పకుండా తన ప్రాతినిధ్యం ఉండేలా చూసుకున్నారు. ఇటీవల జరిగిన డెయిరీ ఎన్నికల్లోనూ ఓటేశారు. ‘‘ఓటు వేయడం మరవొద్దు. అది మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం తగిన వ్యక్తిని ఎన్నుకోవడం మన బాధ్యత అని యువతకు గుర్తుచేస్తున్నాను’’ అని మీడియాతో మాట్లాడుతూ సూచించారు.

వయనాడ్‌లో పోలింగ్‌ తర్వాతే.. అమేఠీలో రాహుల్‌ పోటీపై నిర్ణయం..!

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాకు చెందిన తిజియా బాయీ సాహూ కూడా ఇదే మాట చెప్పారు. అన్నింటినీ పక్కనపెట్టి.. తప్పకుండా ఓటేయండని కోరారు. వృద్ధుల సౌకర్యార్థం ఇంటినుంచే ఓటు హక్కును వినియోగించే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించినప్పటికీ.. 97 ఏళ్ల ఈ బామ్మ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడానికే మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగతంగా వెళ్లి ఓటేస్తే కలిగే అనుభూతి వేరన్నారు. సరైన నేతను ఎన్నుకొనే విషయంలో వీరు చూపుతున్న చొరవ.. యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని