NDA: చంద్రబాబు నివాసంలో ఎన్డీయే సమావేశం.. కీలక అంశాలపై చర్చ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. 

Updated : 12 Apr 2024 16:53 IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. చంద్రబాబుతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, మాజీ మంత్రి సిద్దార్థనాథ్‌ సింగ్‌లు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటోన్న వివిధ స్థానాలపైనా కూటమి నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైనా నేతలు చర్చించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరి, తదితర అంశాలపై నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

బూత్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌ పరిధిలో సమావేశాలు నిర్వహించాలని ఎన్డీయే నేతలు నిర్ణయించారు. ప్రచార వ్యూహం, ఎన్నికల నిర్వహణ పరిశీలనకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గోదావరి జిల్లాల్లో కూటమి సభల విజయంపై నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల ఉమ్మడి సభలు నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయాలని నేతలు సూచించారు. కూటమి తరఫున మోదీ, అమిత్‌ షా, నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, 25 లోక్‌సభ, 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని నిర్ణయానికి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు